సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అసలు తాను ఏం మాట్లాడుతున్నానన్న ధ్యాస కూడా ఉండటం లేదన్న వాదన ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. వైరి వర్గాన్ని డిఫెన్సివ్ మోడ్ లోకి పంపేద్దామన్న మోదీ వ్యాఖ్యలు మొన్నటిదాకా బాగానే పేలాయి గానీ... ఇటీవలి కాలంలో ఆయన నోట నుంచి వస్తున్న ప్రతి కామెంట్ కూడా దీపావళి టపాసులా తుస్సుమంటోంది.
ఇందులో భాగంగా పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ కు ఆయన వినిపించిన మేఘ సందేశం ఎదురు తన్నేసింది. మోదీ చెప్పిన మేఘాల సిద్ధాంతంపై నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో మోదీపై తనదైన శైలిలో ఘాటు సెటైర్లు వేస్తూ వస్తున్న బహు భాషా నటుడు, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీకి దిగిన ప్రకాశ్ రాజ్ మరోమారు ఎంట్రీ ఇచ్చేశారు. మోదీ కామెంట్లపై ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ఏకంగా జంగిల్ బుక్ నే రాసేశారని చెప్పాలి. జనాన్ని పిచ్చోళ్లను చేసేందుకు కూడా ఓ హద్దు ఉండాలంటూ మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్... మోదీని ఏకంగా టార్జాన్ గా అభివర్ణించారు.
ఈ దిశగా ప్రకాశ్ రాజ్ ఏమన్నారన్న విషయానికి వస్తే... *భారత్ లో పౌరులందరికీ డిజిటల్ టెక్నాలజీ, ఈ-మెయిల్ సౌకర్యం అన్నది 1990వ దశకంలో అందుబాటులోకి వచ్చింది. కానీ చౌకీదార్(మోదీ) అడవిలో ఉంటూ మేఘాలు ఆకాశంలో చుట్టుముట్టగా మహాభారతం చదువుతూ ఈ సాంకేతికతను 1980వ దశంలోనే సాధించారు. ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుంది భాయ్* అంటగూ ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో జంగిల్ బుక్ ఫిలాసఫీని వినిపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఏదో తాను ప్రాస కలిసివస్తుందనుకుంటే.. ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు ఏకంగా తనపై జంగిల్ బుక్సే తెరుస్తున్నారేమిటని మోదీ ఇప్పుడు ఆందోళనలో పడిపోయారని చెప్పక తప్పదు.