రాజకీయాల్లో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఏమాత్రం తప్పటడుగు వేసినా.. గెలుపు ఓటములు పక్కకు పోయి..ఇమేజ్ కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయం.. టీడీపీ యువ నాయకురాలు.. రాజమండ్రి సిటీ.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ విషయంలో విశ్లేషకులు అభిప్రాయపడుతు న్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు.. దివంగత ఎర్రన్నాయుడు కుమార్తెగా.. గుర్తింపు ఉన్న.. భవానీ.. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
ప్రజలు కూడా.. జగన్ సునామీని.. వైసీపీ హవాను కాదని..ఇ క్కడ.. టీడీపీకి పట్టం కట్టారు. మరి .. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న ఆమె.. ప్రజలకు చేరువ కావడంలో ఎక్కడో విఫలమవుతున్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. అసెంబ్లీలోనూ.. పెద్దగా పార్టిసిపేషన్ లేదని.. స్వయంగా చంద్రబాబు కూడా చెప్పారు. మరి.. ఈ నేపథ్యంలో తన గ్రాఫ్‌ను బాగుచేసేందుకు.. బలమైన నాయకురాలిగా ముందుకు వెళ్లేందుకు .. ఆమె ప్రయత్నించాల్సి ఉంది.
కానీ, ఉన్నపళంగా ఆమె.. తీసుకున్న నిర్ణయం.. రాజకీయంగా ఆమెపై ప్రభావం పడేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
అదే.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన భర్త వాసు పోటీ చేస్తారని ప్రకటించడం! ఈ ప్రకటన తర్వాత.. ఒక్కసారిగా భవానీ ఇమేజ్ పడిపోయిందనేది తమ్ముళ్ల మాట. ఆమెకు ఉన్న ఇమేజ్ కారణంగానే గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారని.. ఇప్పుడు ఆమె కాకుండా.. ఆమె తన భర్తను ఇక్కడ దింపితే.. విజయంపై ఆశలు తగ్గుతాయని.. కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు.. వచ్చే ఎన్నికల్లలో టికెట్ దక్కించుకునేందుకు గోరంట్ల బుచ్చయ్య అనుచరుడు ఒకరు ప్రయత్నిస్తున్నారు. గతంలో గోరంట్ల సిటీ నుంచి విజయం దక్కించుకున్నదరిమిలా.. ఆయనను గత ఎన్నికలకు ముందు.. రూరల్‌కు పంపించారు.
ఈ క్రమంలో.. ఇప్పుడు భవానీ ఎలానూ తప్పుకొంటున్నార నే ప్రకటన చేసిన తర్వాత.. ఇక్కడ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. భవానీ భర్త వల్ల పార్టీ విజ యం దక్కించుకోవడం కష్టమని.. పార్టీలోనే గుసగుస వినిపిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ టికెట్ వివాదంపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.