అశ్లీల వెబ్ సైట్లకు చెక్ చెప్పే దిశగా మోడీ సర్కారు అడుగులు వేయటం.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగటంతోపాటు.. వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు సైతం ఈ స్వేచ్ఛ ఉండాల్సిందేనని పేర్కొన్న నేపథ్యంలో.. ప్రభుత్వం నియంత్రించటంపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అశ్లీలానికి చెక్ చెబుతున్నట్లు కనిపించినా.. రానున్న రోజుల్లో మరిన్ని విషయాల్లో ఇలాంటి బ్యాన్ చేస్తే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు అశ్లీల వెబ్ సైట్ల మీద కన్నెర్ర చేసిన కేంద్ర సర్కారు రానున్న రోజుల్లో సోషల్ నెట్ వర్క్స్ ను సైతం ఇలానే నియంత్రిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఒక పోర్న్ వెబ్ సైట్ మోడీ సర్కారుపై పంచ్ వేసింది. భారత్ లో పోర్న్ వెబ్ సైట్ల పై నిషేధం విధించటాన్ని బ్రిటన్ కు చెందిన ఇండిపెండెంట్ పత్రిక ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించటంపై సదరు పోర్న్ వెబ్ సైట్ స్పందిస్తూ.. భారతీయులు వచ్చే ఎన్నికల్లో తమ ఓటును సరిగా వినియోగించుకోవాలని సూచించటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అశ్లీల వెబ్ సైట్లపై నిషేద కొరడాను విదల్చటం పట్ల సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ సర్కారు నిర్ణయాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ.. పోస్టులు చేస్తున్నారు. ఇలా.. ఇంటా బయటా మోడీ సర్కారు నిర్ణయంపై విమర్శలు.. వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మరోవైపు.. అశ్లీల వెబ్ సైట్లపై తాత్కలిక నిషేధం విధించిన వైనంపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో.. దీనిపై వెనకడుగు వేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.