అమ్మాయి అందంగా ఉందని ఎదురుకట్నం ఇచ్చి మరీ చేసుకుంటే!

Update: 2020-03-10 14:30 GMT
పెళ్లి ..జీవితం లో ఒకే ఒకసారి జరిగే ఈ అతిముఖ్యమైన వేడుక గురించి ప్రతి ఒక్కరూ ఎన్నో కలలు కంటారు.పెళ్లి తరువాత నా జీవితం అలా ఉండాలి ..ఇలా ఉండాలి అంటూ ఊహల్లో తేలిపోతుంటారు.అయితే, దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది అమ్మాయిలు మోసం చేయడం ఈ మధ్య ఫ్యాషన్ గా మారిపోయింది. అమ్మాయి అందంగా ఉందని , ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటే ..పెళ్లి అయిన కొత్తలో అత్తవారింట్లో కోడలు అంటే ఇలానే ఉండాలి అని అనిపించుకుని , సమయం రాగానే తనలో ని మరోకోణాన్ని బయటపెట్టింది. అప్పటివరకు ఆ ఇంట్లో అందరితో కలిసి మెలిసి ఉన్న ఆ కోడలు .. అత్తగారి ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బు తో పారిపోయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ జిల్లా గుడ్లీ గ్రామం లో జరిగింది.

ఈ వ్యవహారం పై పూర్తి వివరాలని చూస్తే ... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ జిల్లా గుడ్లీ గ్రామానికి చెందిన ముఖేశ్ సేథియా అనే యువకుడు ఇండోర్ కి చెందిన స్వప్నను చూసి , ఇష్టపడి, ఆమె అందానికి మెచ్చి రూ.5 లక్షల ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి అందంగా ఉండటం , అబ్బాయికి నచ్చడం తో ఎదురుకట్నం ఇచ్చి చేసుకోవడంలో తప్పులేదు. కానీ , పెళ్లి జరిగిన తర్వాత శోభనం రాత్రిని తూతూమంత్రంగా ముగించిన ఆ యువతి... ఆ తర్వాత భర్త పట్ల ఇష్టంగా ఉండేది కాదు. కానీ, ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యుల తో ప్రేమగా మసలుకుంటూ వచ్చింది. అదే సమయంలో ఆమె రహస్యంగా చాటింగ్ చేస్తున్న విషయాన్నిగమనించిన భర్త దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

అలా కొన్ని రోజులు జరిగిన తరువాత .... ఒకరోజు అకస్మాత్తుగా స్వప్న ఇంట్లో కనిపించలేదు. ఆమెతో పాటుగా ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కూడా కనిపించకపోవడం తో షాక్ అయిన ఆమె భర్త చాలా చోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడం తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు దిమ్మదిరిగే వాస్తవాలు తెలుసుకున్నారు. స్వప్న ఓ ముఠాలో సభ్యురాలని, సంపన్నుల బిడ్డలకు వలవేసి వారిని పెళ్లి ఉచ్చులో దింపి, పెళ్లి అని మోసం చేయడం , ఆ తరువాత అందిన కాడికి తీసుకోని మాయమైపోవడం. ఇదే స్వప్న నైజం అని కనుగొన్నారు. అలాగే మరో విషయం ఏమిటంటే ..స్వప్న చేతిలో మోసపోయింది ముఖేశ్ ఒక్కడే కాదు. అంతకుముందే అనేకమందిని ఇదే విదంగా మోసం చేసింది అని పోలీసులు తెలిపారు. దీనితో స్వప్న కోసం , ఆమె ముఠా సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News