ఎయిర్‌ పోర్ట్ నుంచి విమానం ఎత్తుకెళ్లారు

Update: 2018-08-11 07:24 GMT
ఔను. సాక్షాత్తు విమానం చోరికి గురైంది! అది కూడా ఎయిర్‌ పోర్ట్ నుంచి!. ఆ విమానాన్ని ప‌ట్టుకునేందుకు ఫైట‌ర్లు వెంబ‌డించారు. ఇదంతా జ‌రిగింది అమెరికాలో. సియాటిల్‌ లోని టకోమా విమానాశ్రయంలో చోటుచేసుకుంది.  విమానాశ్రయంలో పార్కింగ్ చేసి ఉన్న విమానాన్ని ఓ వ్య‌క్తి ఎత్తుకెళ్లాడు. ఆయ‌న ఎవ‌ర‌య్యా అని ఆరాతీస్తే..... సంస్థ‌కు చెందిన‌ 29 ఏళ్ల ఓ ఉద్యోగి అని తేలింది. 78 సీట్లు ఉన్న ఆ ప్లేన్‌ లో ప్రయాణికులు ఎవరూ లేరు. ఏటీసీ అనుమతి లేకుండానే..విమానాన్ని చోరీ చేశాడని - అయితే ఆ విమానం కీట్రన్ దీవుల్లో కూలినట్లు పోలీసులు చెబుతున్నారు.

సియాటిల్ ఆకాశ మార్గంలో ఓ ప్లేన్ విపరీతంగా చక్కర్లు కొడుతూ కనిపించింది. పల్టీలు కొడుతున్న విమానాన్ని.. అనేక మంది తమ మొబైల్ ఫోన్‌ లో బంధించారు. ఆ వీడియోలే షోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే స‌మ‌యంలో ఓ విమానాన్ని ఎయిర్‌ పోర్ట్ నుంచి దొంగలించారని వార్త‌లు వ‌చ్చాయి. అధికారులు వివ‌రాలు సేక‌రించిన అనంత‌రం హోరైజన్ ఎయిర్ క్యూ400 విమానాన్ని ఎత్తుకెళ్లిన‌ట్లు తేల్చారు. దీంతో ఆ విమానాన్ని అమెరికా జెట్ ఫైటర్లు వెంబడించాయి. కాగా,  ప్లేన్‌ ను ఎత్తుకెళ్లిన పైలట్ ఏమయ్యాడన్న దానిపైన కూడా స్పష్టత లేదు. అయితే ఈ ఘటన ఉగ్రవాద చర్య కాదు అని పియర్స్ కౌంటీ పోలీసులు చెప్పారు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News