అమరావతి మీద ఇప్పటికే ఉన్న ఆరోపణలు సరిపోవన్నట్లుగా తాజాగా సంచలన ఆరోపణల బాంబు వేశారు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కమ్ సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న అజేయ కల్లం. ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటు వెనుక భారీ భూ కుంభకోణం ఉందన్న విమర్శలు.. ఆరోపణలు మొదట్నించి వస్తున్నవే. అయితే.. ఇప్పటివరకూ వచ్చినవన్నీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు సంబంధించిన ఆరోపణలే.
అందుకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ముఖ్య సలహాదారు చేసిన తీవ్ర ఆరోపణలు కలకలంగా మారాయి. అమరావతిలో రైతులు ఇచ్చిన భూములకు సంబంధించి భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. అందులో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు.. అడ్వొకేట్ జనరళ్లు.. మీడియా అధినేతల చేతుల్లో అమరావతి భూములు ఉన్నట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు.
రాజధాని కోసం సమీకరించిన భూముల్లో అధిక శాతం ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. తన వారితో భూములు కొనిపించిన చంద్రబాబు వారితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించారన్నారు. రాయలసీమలో తాగునీటి కోసం ఏడుస్తుంటే అమరావతి లో కొందరు కోట్లు పోయాయని ఏడుస్తున్నారంటూ విమర్శనాస్త్రాల్ని సంధించారు. రైతులు అమరావతిలోనే ఉన్నారా? విశాఖపట్నం.. కర్నూలు జిల్లాలో లేరా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ అమరావతి భూములపై వినిపించిన వాదనకు భిన్నంగా.. తాజాగా తెర మీదకు వచ్చిన ఆరోపణల పర్యవసానాలు ఎక్కడి వరకూ వెళ్లనున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.