గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చాలామంది ప్రముఖులు ఓటేసేందుకు వచ్చారు. అలా వచ్చిన ప్రముఖులంతా తమ ఓటుహక్కు వినియోగించుకొని బయటకు రావటం.. మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఓటుహక్కు అందరూ వినియోగించుకోవాలని.. ప్రశ్నించాలనుకునే వారు ఓటు వేస్తేనే తమకు ఆ హక్కు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదని చెప్పటం కనిపించింది.
ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికల్లో చాలామంది ప్రముఖులు ఓటు వేశాక మాట్లాడినా.. సినీ నటి.. నాగార్జున సతీమణి అమల నోటి నుంచి వచ్చిన రెండు మాటలకు హర్షాతికేకాలు వ్యక్తమయ్యాయి.
నాగార్జునతో పాటు ఓటేసేందుకు అమల వచ్చారు. ఓటేసి బయటకు వచ్చిన తర్వాత నాగ్ మీడియాతో మాట్లాడారు. నాగ్ మాట్లాడిన తర్వాత మాట్లాడాలని అమలను కోరితే.. సేమ్ అని వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అక్కడున్న మీడియా ప్రతినిధి ఒకరు మహిళా ఓటర్లకు మీరేం చెబుతారని ప్రశ్నించారు. దానికి స్పందించిన అమల.. అందరూ ఓటేయాలి.. ఓటేస్తేనే ముందుకెళ్లొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అమల మాట్లాడిన మాటల్లో.. ముందుకెళ్లొచ్చంటూ చెప్పిన పదంతో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ తరహా పదాల్ని ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత నోటి వెంట వస్తుండటం గమనార్హం.