అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలోని హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచివరుస విజయాలు సాధిస్తున్న నాయకుడుగానే కాకుండా.. మజ్లిస్ పార్టీ అధినేతగా దేశవ్యాప్తంగా ఆయన సుపరిచితులు. అంతేకాదు.. పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఆయన సెంటరాఫ్‌ది టాపిక్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఆరు మాసాల ముందుగానే అసదుద్దీన్ ఓవైసీ సెంటరా ఫ్‌ది టాక్ అయ్యారు.
ఉత్తర్ప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడ ఎన్నికలు జరగ నున్నాయి. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 110 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లు 30-39 శాతం ఉన్నారు. మరో 44 స్థానాల్లో ఆ సంఖ్య 40-49 శాతంగా ఉంది. వీటితోపాటు ముస్లిం ఓట్లు 50-65 శాతం ఉన్న మరో 11 సీట్లు ఉన్నా యి. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో బీజేపీ పోటీ చేసినా 81 స్థానాల్లో విజయం సాధించలేకపోయిం ది. అయితే.. ఈ సారి మాత్ర బీజేపీ వీటిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. అయితే.. ఇవే సీట్లపై ప్రధాన ప్రతిపక్షాలు.. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలు.. దృష్టి పెట్టాయి.
అయితే.. ఏ పార్టీ అయినా.. ఆయా ముస్లిం స్థానాల్లో విజయం దక్కించుకోవడం కష్టమనే భావన సర్వత్రా వినిపిస్తోంది. ఎందుకంటే.. గత ఎన్నికలే కాకుండా.. 2019లో జరిగిన సార్వత్రిక సమరంలోనూ ఆయా పార్టీలు వెనుకంజలో ఉన్నాయి. దీంతో ఇప్పుడు బీజేపీని పక్కన పెడితే.. కాంగ్రెస్, బీఎస్పీలు.. అసదుద్దీన్ వైపు చూస్తున్నాయి. మజ్లిస్‌తో అవగాహన కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా జరిగినప్పటికీ.. ఓవైసీ నుంచి ఆశించిన మేరకు సమాధానం రాలేదని .. ఇటీవల కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
ఇదిలావుంటే.. ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ కూడా అసదుద్దీన్‌వైపు చూస్తోంది. ఎస్పీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎట్టి పరిస్థితిలోనూ .. అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన.. ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 81 నియోజకవర్గాల్లో 30 స్థానాల్లో గతంలో గెలిచిన అఖిలేష్.. అధికారంలోకి వచ్చేందుకు ఈ సీట్లు ఎంతో దోహదపడ్డాయి. అయితే.. ఇప్పుడు దీనికి మించి అన్నట్టుగా ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారు. అయితే.. అసదుద్దీన్ ఓవైసీ ఏమేరకు సహకరిస్తారనేది చర్చకు దారితీస్తోంది.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు బీజేపీ 312 సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం ఓట్ల శాతం లో 39.67శాతం ఓట్లు సాధించింది. ఎస్పీ 47, బీఎస్పీ 19, కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితమయ్యాయి.వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యకాలంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, దాన్ని గద్దె దించాలని ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకుపై ఈ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుండడం గమనార్హం. అయితే.. బీజేపీకి అసదుద్దీన్ బీ టీం.. అంటూ.. బిహార్ ఎన్నికల్లో ఆరోపించిన.. కాంగ్రెస్.. ఇప్పుడు ఆయనతో చర్చలకు దిగడం ఆసక్తిగామారింది.