కడక్​నాథ్​ కోడి.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..!

Update: 2021-03-04 01:30 GMT
కోడిమాంసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. ! అంటే ఇక్కడ నాన్​ వేజ్​ ప్రియుల గురించి మాట్లాడుతున్నాం.. కోడి కూర, వేపుడు, పులుసు, ఫ్రై, చికెన్​ టిక్కా ఏ వెరైటీ అయినా తీసుకోండి కోడి కూర కు ఉన్న డిమాండ్​ వేరు. ఇదిలా ఉంటే ఇటీవల కడక్ నాథ్​ కోడి కి విపరీతం గా డిమాండ్​ పెరిగింది. గతంలో చాలా మంది బాయిలర్​ చికెన్​ కు బదులుగా నాటు కోడి తినే వాళ్లు.. అయితే ఇప్పుడు మాత్రం కడక్ ​నాథ్​ కోళ్ల ను తింటున్నారు.

కడక్ ​నాథ్​ చికెన్​ ధర కిలో రూ. 1000 నుంచి 1200 ఉంటుంది. అయినప్పటికీ ఈ కోడి అంటే ఎంతో క్రేజ్​ ఉంది.  ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చికెన్​ కు ఫుల్​ డిమాండ్​ ఏర్పడింది. కడక్‌ నాథ్ కోడి మాంసం చూడటానికి నల్ల గా ఉంటుంది. కోడి కూడా ఇదే రంగు లో ఉంటుంది.

అయితే కడక్​నాథ్​ కోడి ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకు కారణం ఇందులో కొవ్వు తక్కువ గా ఉండటమే. దీంతో షుగర్​పేషెంట్లు, బీపీ పేషెంట్లు కూడా ఈ మాంసాన్ని ఇష్టపడుతున్నారు. వెరసి ధర పెరిగింది.  ఈ కడక్‌నాథ్ కోడి ఎక్కువగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్‌ ల లోని గిరిజన ప్రాంతాల్లో పెరిగేవి. ప్రస్తుతం దీని డిమాండ్​ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కోళ్ల ను పెంచుతున్నారు. టీమిండియా మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోనీ కడక్‌ నాథ్ కోళ్లు బిజినెస్ పెట్టారు. దీంతో ఈ కోళ్ల కు మరింత డిమాండ్​ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్​ లో కడక్​ నాథ్ కోళ్లు బాగానే అమ్ముడవుతున్నాయి.

పలు రెస్టారెంట్లలో కూడా ఈ మాంసం దొరుకుతుంది. రుచితో పాటు శరీరానికి కూడా ఎంతో మంచిది కాబట్టి కడక్​నాథ్ కోడిని తింటున్నామని హైదరాబాదీలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కడక్​నాథ్​ కోడి అమ్ముడవుతున్నది.
Tags:    

Similar News