కరోనా ఎఫెక్ట్: భారత్ లో టెలీమెడిసన్ సేవలు

Update: 2020-03-26 17:30 GMT
సాధారణంగా రోగమొస్తే ఆర్ ఎంపీ - లేదా ఎంబీబీఎస్ డాక్టర్ వద్దకు పోయి సూదులు - మందులు వేసుకుంటాం. కానీ కరోనా వైరస్ విజృంభణతో ఇప్పుడన్నీ మూతపడ్డాయి. మరి ఇప్పుడు రోగమొచ్చినా - రోప్పి వచ్చినా దేశంలోని ప్రజలు ఏం చేయాలి? అందుకే తాజాగా దేశంలో ‘టెలీమెడిసన్’ సేవలను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ విధానంలో వీడియో కాల్ - ఫోన్ సంభాషణ - మెసేజ్ ల ద్వారా వైద్యులు రోగులకు వైద్య సలహాలు అందిస్తారు. భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో ఈ టెలీమెడిసన్ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. చైనా కూడా తాజాగా అమలు చేసింది.

కరోనా వైరస్ తో దేశమంతా లాక్ డౌన్ అయ్యింది. పల్లెలు - మారుమూల గ్రామాల్లో ఫోన్ ఎలాగూ ఉంటుంది. వారికి రోగాలొస్తే ఈ టెలిమెడిసన్ ద్వారా చికిత్స చేయవచ్చని కేంద్రం ఈ పాలసీ తెచ్చింది. దీని వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. ఎక్కువ మందికి అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించడానికి వీలవుతుంది.

టెలీ మెడిసన్ సేవలు అందించేందుకు వైద్యులు రిజిస్టర్ చేసుకోవాలని మెడికల్ కౌన్సిల్ కోరింది. కరోనా వ్యాపించకుండా పేదలకు మెరుగైన వైద్యం దీంతో అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


Tags:    

Similar News