రాజధాని మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామని చేసిన ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనతో గుంటూరు, కృష్ణా జిల్లాలు ఉలిక్కిపడ్డాయి. తమ విలువైన భూములు రాజధాని కోసం ఇస్తే మీరు రాజధానిని వేరే ప్రాంతానికి తరలిస్తారా అని నిలదీస్తూ ప్రధానంగా మందడం, తుళ్లూరు, మంగళగిరి తదితర ప్రాంతాల రైతులు ఆందోళన బాట పట్టారు. వారి ఆందోళనలు వివిధ రూపాల్లో నిరవధికంగా కొనసాగుతున్నాయి. తాజాగా వీరి పోరాటం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో దేశం దృష్టికి తమ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాజధాని రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. అమరవాతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 16 మంది రైతులు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి శనివారం వెళ్లారు. ప్రధానమంత్రిగా అమరావతికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ కి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వెళ్లారు. మీరు శంకుస్థాపన చేసిన నగరమే నేడు కనుమరుగవుతోంది అని చెప్పేందుకు వచ్చామని రైతులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు వెల్లడించారు.
శనివారం నాటికి వారి ఆందోళనలు 46వ రోజు కు చేరుకున్నాయి. అమరావతి ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు వచ్చి వారితో మాట్లాడినా రైతులు ఆందోళన విరమించ లేదు. ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరిస్తుందని, త్వరలో కమిటీ వేసి రాజధాని రైతులకు న్యాయం చేస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. అయితే ఆయన హామీని పట్టించుకోకుండా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.