ఆది...టీడీపీ నేత‌ల‌ను హ‌త్య చేయించిన చ‌రిత్ర నీది

Update: 2017-08-05 08:54 GMT
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌క్తిత్వం గురించి తెలియ‌కుండా మాట్లాడుతున్నార‌ని వైసీపీ ఎమ్మెల్యేలు స్ప‌ష్టం చేశారు. జ‌గన్ వ్య‌క్తిత్వం గురించి ఇప్పుడు మాట్లాడేవారు ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి గురించి అవ‌గాహ‌న తెచ్చుకోవాల‌ని అన్నారు. కడప జిల్లా వైసీపీ అద్యక్షులు అమర్నాథ్ రెడ్డి - ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి - కొరుముట్ల శ్రీనివాసులు - ముస్తఫా నంద్యాల వైసీపీ కార్యాలయంలో విలేక‌రుల సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మంత్రుల తీరుపై విరుచుకుప‌డ్డారు. నంద్యాలలో జరిగిన బహిరంగ సభను ప్రజలు భారీగా హాజరై జయప్రదం చేశారని, ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డిచే జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయించి నీతివంతమైన రాజకీయాలకు తెరలేపారని గుర్తు చేశారు. దొంగ రాజీనామాలు కాకుండా స్పీకర్ ఫార్మాట్ లో చక్రపాణి రెడ్డి రాజీనామా చేశారని ప్ర‌స్తావించారు.

ఐదుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి అడ్డదారిలొ మంత్రి అయిన సోమిరెడ్డికి త‌మ నాయ‌కుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించే హక్కు లేదని వైసీపీ నేత‌లు స్ప‌ష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి సోమిరెడ్డి ప్రజలను సొమ్ము దోచుకుంటున్నారు అని ఆరోపించారు. వైఎస్ ఆర్ జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి వైఎస్ ఆర్ పెట్టిన బిక్షతో ఎమ్మెల్యే అయి ఇప్పడు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీ ముఖ్య నాయకుడుని హత్య చేయించిన చరిత్ర ఆదినారాయణ రెడ్డిది అని అన్నారు. టీడీపీకి జీవితాంతం సేవ చేసిన శివారెడ్డి ని హత్య చేయించి ఫ్యాక్షన్ రాజకీయలకు మారుపేరుగా నిలిచిన చరిత్ర మీది అని వైసీపీ నేత‌లు గుర్తు చేశారు. పరిటాల కుటుంబ హత్యా రాజకీయాలకు ఎన్నో కుటుంబాలు బలైయ్యాయి అలాంటి చరిత్ర గల మంత్రి పరిటాల సునీత కూడా జగన్ ను విమర్శించడం చిత్రంగా ఉందన్నారు.

చంద్రబాబు క్యాబినెట్ ముఠా అంతా బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు మండిప‌డ్డారు. ``నంద్యాల‌లో ఓటర్లను బ‌హిరంగంగానే బెదిరిస్తూ మీకు బుద్ది ఉందా అని తిట్టిన చంద్రబాబు గురించి మాట్లాడరు, అసెంబ్లీలో అంతుచూస్తా అని చంద్రబాబు మాట్లాడితే అప్పుడు మాట్లాడరు, కానీ సంక్షేమ పథకాలు అందటం లేదు, ఫీజ్ రీయింబర్స్ మెంట్ అందటంలేదని ప్రశ్నిస్తే జగన్ ను విమర్శిస్తారా?`` అని ప్రశ్నించారు. నా రోడ్లపై నడుస్తున్నారని ప్రజలపై విరుచుకుపడ్డ చంద్రబాబు ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్ ను విమర్శిస్తున్నారు అని వైసీపీ నేత‌లు వ్యాఖ్యానించారు. అధికారం కోసం అమ్ముడుపొయిన వ్యక్తులు త‌మ‌పై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఆనాడు  కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చేపుడు ,అందరూ రాజీనామా చేసి రావాలని పిలుపు నిచ్చిన నీతిమంతుడు జగన్ మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను తెలంగాణాలో కేసీఆర్ చేర్చుకొవటం తప్పు అని చంద్రబాబు అన్నారు కానీ ఇక్కడ కూడా అదే చేశార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌స్తావించారు. చవకబారు మాటలు మానాల‌ని లేకుంటే ప్రజలు టీడీపీ బుద్ది చెప్పే రోజు వస్తుందని అన్నారు. తన తండ్రి రాజారెడ్డిని హత్య చేయించిన వారిని కూడా క్షమించిన ఘనత వైఎస్ కుటంబానిది అన్నారు. జిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య, ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కుట్రలు చేసినా  మైనార్టీ ప్రజలు వైసీపీ అబ్యర్ధి  శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేస్తారని అన్నారు.
Tags:    

Similar News