300 కోట్ల ఆ ఇంద్రభవనాన్ని కేసీఆర్ ఏం చేస్తారు?

Update: 2020-06-15 23:30 GMT
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బేగంపేటలో విశాలమైన 4 ఎకరాల్లో ఓ ఇంద్రభవనం లాంటి ప్యాలెస్ ను 2008లో నిర్మించారు. హైదరాబాద్ ‘హుడా’ కార్యాలయం కోసం దీన్ని వాడారు. 2008లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీన్ని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి కేటాయించారు.

2008 నుంచి ఈ 300 కోట్ల సుందరమైన సకల హంగులున్న కార్యాలయంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయమే కొనసాగుతోంది. అయితే తాజాగా నానక్ రామ్ గూడలోని ఫైనాన్షియల్ ఏరియాలో 12 ఎకరాల్లో దాదాపు 2658 కోట్లతో అమెరికా కాన్సులేట్ కార్యాలయం నూతన భవనం సిద్ధమైంది. బేగం పేట ప్యాలెస్ నుంచి నూతన భవనంలోకి అమెరికా కాన్సులేట్ మారిపోనుంది.

దీంతో ఈ 300 కోట్ల భారీ ప్యాలెస్ ను ఏం చేయాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ విలువైన ఆస్తిని లీజుకివ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చా? లేక అమ్మేస్తే లాభమా అనే దానిపై అధికారులు పూర్తి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇస్తున్నారట.. తెలంగాణ ప్రభుత్వం ఈ భారీ ప్యాలెస్ ను ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News