విమాన ప్రయాణికులను తీవ్ర ఉత్కంఠకు గురి చేసి సంఘటన ఇది. పైలట్ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఓ ఫ్లైట్ మెడికల్ ఎమర్జెన్సీ అలర్ట్ ఇచ్చి ల్యాండ్ అయింది. అయితే చివరి వరకు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు. డల్లాస్ నుంచి న్యూమెక్సికో వెళ్తున్న ఫ్లయిట్‌లో ఈ ఘటన జరిగింది. అమెరికా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ కోపైలట్ కు విమానంలోనే గుండెపోటు వచ్చింది. దీంతో ల్యాండింగ్ కు మరో రెండు మైళ్ల దూరం ఉందన్న సమయంలో ఫ్లయిట్ కెప్టెన్ మెడికల్ ఎమర్జెన్సీ సందేశం పంపాడు. అయితే ఆ కో పైలట్ ప్రాణాలు విడిచాడు. అయితే ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండానే విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
విమాన కాక్ పిట్ లోనే కుప్పకూలిపోయిన ఆ కో పైలట్ ను విలియమ్స్ మైక్ గ్రబ్స్‌గా గుర్తించారు. అతనికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. విమానం సురక్షితంగా దిగడంలో పైలట్ సహకరించాడు. 2015లోనూ ఫినిక్స్ నుంచి బోస్టన్ వెళ్తున్న విమానంలో దాని పైలట్ ఇలాగే అకస్మాత్తుగా మృతిచెందాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/