ఒక్క‌మాట‌తో గాలి క‌ల‌ల కోట‌ల్ని కూల్చేశాడుగా?

Update: 2018-04-01 05:16 GMT
బీజేపీ పేరు చెప్పినంత‌నే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా చెబుతుంటారు. కాంగ్రెస్ లో మాదిరి అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం అస్స‌లు క‌నిపించ‌దు. త‌మ లోప‌లి అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టే సాహ‌సం బీజేపీలో ఎవ‌రూ చేయ‌రు. ఒక‌వేళ చేసినా.. ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

క్ర‌మ‌శిక్ష‌ణ పార్ట్ ను ప‌క్క‌న పెడితే.. అవినీతి ఆరోప‌ణ‌లు.. కుంభ‌కోణాలు చేసేటోళ్ల పేర్లు పెద్ద‌గా బ‌య‌ట‌ప‌డ‌వు. అలా అని.. తుల‌సిప‌త్రంలా స్వ‌చ్చంగా ఉంటారనుకుంటే అత్యాశే.కాకుంటే.. బ‌రితెగింపు క‌నిపించ‌దంతే. చేసేదేదో గుట్టుగా.. బ‌య‌ట‌కు రాకుండా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డుతూ ప‌నులు పూర్తి చేసేసుకుంటారు.

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు.. బ‌రితెగింపు వ‌ర‌కూ వెళ్ల‌న‌ట్లుగా చెప్పే అవినీతితో వెళ్లే బీజేపీకి ఏ మాత్రం సూట్ కాన‌ట్లుగా క‌నిపిస్తారు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ సౌత్ లో బీజేపీ పాగా వేసిందంటే అది క‌ర్ణాట‌క‌లో మాత్ర‌మే. అది కూడా గాలి బ్ర‌ద‌ర్స్ హ‌వాతోనే. పార్టీని అధికారంలోకి తెచ్చిన గాలి.. బీజేపీని వాడేసినంత బాగా మ‌రెవ‌రూ వాడేయ‌లేద‌న్న పేరుంది.

ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. కేంద్ర పార్టీని కిమ్మ‌న‌కుండా చేయ‌టంలో గాలి నేర్పు అప్ప‌ట్లో జాతీయ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నిలువెత్తు అవినీతితో.. మైనింగ్ కింగ్ గా పిలుచుకునే గాలి జోరుకు సీబీఐ క‌ళ్లెం వేయ‌టం.. గాలిని జైలుకు పంప‌టంతో ఆయ‌న హ‌డావుడికి బ్రేక్ ప‌డింది. అదే స‌మ‌యంలో గాలితో త‌మ‌కు సంబంధం లేన‌ట్లుగా బీజేపీ ఉండ‌టం మొద‌లైంది. జాతీయ రాజ‌కీయాల్లోకి మోడీ ఎంట్రీ త‌ర్వాత గాలి ఊసే లేదు. పార్టీ ద‌గ్గ‌ర‌కు రానిచ్చింది లేదు. అయితే.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌టం ద్వారా మ‌ళ్లీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌న్న‌ది గాలి ఆలోచ‌న‌గా చెబుతారు.

దీనికి త‌గ్గ‌ట్లే త‌న‌కున్న పాత ప‌రిచ‌యాల‌తో బీజేపీ త‌ర‌ఫు పోటీ చేయ‌టం కోసం గ‌డిచిన కొద్దికాలంగా పావులు క‌దుపుతున్నారు. గాలి జ‌నార్ద‌న్ కున్న పేరు ప్ర‌ఖ్యాతుల గురించి అవ‌గాహ‌న ఉన్న మోడీషాలు.. ఆయ‌న్ను ఇప్ప‌టివ‌ర‌కూ ద‌గ్గ‌ర‌కు రానిచ్చింది లేదు. అయితే.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డిన వేళ‌.. బీజేపీలో మ‌ళ్లీ గాలి హ‌వా షురూ అయిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్న‌వేళ‌.. గాలి క‌ల‌ల కోట‌లు బ‌ద్ధ‌ల‌య్యే మాట‌ను బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చెప్పేశారు.

గాలితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే.. గాలి ఖ‌ర్చుతో క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఒక వెలుగు వెలిగిన‌ట్లుగా చెబుతారు. గ‌డిచిపోయిన గ‌తాన్ని గుర్తు పెట్టుకొని.. లేనిపోని స‌మ‌స్య‌ల్ని నెత్తిన వేసుకునే క‌న్నా.. విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లున్న గాలిని దూరంగా పెట్ట‌ట‌మే మంచిద‌ని షా భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే తాజా క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌లో గాలి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ.. గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేద‌న్న క్లారిటీ ఇచ్చేశారు.

ఇంత స్ప‌ష్టంగా గాలి గురించి  షా నోటి నుంచి వ‌చ్చిందంటే.. అది క‌చ్ఛితంగా మోడీ మాట‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. చూస్తుంటే.. గాలి అవ‌స‌రం లేద‌ని మోడీ  భావిస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న‌కు తిరుగులేద‌న్నకాన్ఫిడెన్స్ తో ఉన్న మోడీకి గాలి అవ‌స‌రం లేద‌నిపించ‌టంలో త‌ప్పేం కాదు. కానీ.. ఇదేదీ గ‌తంలో గాలికి నిలువెల్లా ఉండేలాంటి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అలా అయితే మాత్రం మోడీ బ్యాచ్ కు తిప్ప‌లు త‌ప్ప‌వు.
Tags:    

Similar News