బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్‌షా రెండోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. అధ్యక్ష స్థానానికి ఆయన తప్ప మరొకరు పోటీ చేసింది లేదు. అయితే.. ఈ ఎన్నిక ప్రక్రియ సందర్భంగా ఒక విశేషం చోటు చేసుకుంది. ఈ ఎన్నిక జరుగుతున్న సమయంలో బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ.. మురళీమనోహర్ జోషి లాంటి పెద్దలు హాజరు కాలేదు. సీనియర్లకు చెక్ చెప్పేలా మోడీ వ్యవహరించటం.. అవకాశం వచ్చినప్పుడు మాటలతో మోడీకి షాకులివ్వటం లాంటివి బీజేపీ సీనియర్లు చేస్తున్నారు.
తన ఎన్నిక సమయంలో పాలు పంచుకోని సీనియర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో అమిత్ షా ఎప్పటిలానే మోడీ బాట పట్టారు. కీలక పదవులు ఇవ్వకుండా మొండి చేయి చూపించే మోడీ.. ఏదైనా వేదిక మీద మాత్రం సీనియర్లను పొగిడేసే విధానానికి తగ్గట్లే తాజాగా అమిత్ షా వ్యవహరించారు. రెండోసారి జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత.. ఆశీస్సుల కోసం అద్వానీ ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన వ్యక్తికి ఆశీస్సుల్ని అందించి అద్వానీ సాగనంపి తన పెద్దరికాన్ని ప్రదర్శించుకున్నారు.