లక్షల కోట్ల సంపదకు వారసురాలైన ఈమె రూటే సపరేటు

Update: 2023-05-21 09:25 GMT
ఇండియాలో ఎక్కువ శాతం మంది పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై ఆధారపడి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. తండ్రి ఆస్తులకు వారసులుగా చెప్పుకుంటూ ఆ ఆస్తిని మరింతగా పెంచిన వారే ఇండియాలో అధికులుగా కనిపిస్తూ ఉంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే తండ్రి వారసత్వంతో సంబంధం లేకుండా సొంతంగా వ్యాపారాలు సాగిస్తూ సొంత జీవితాన్ని గడుపుతూ ఉంటారు.

ఆ కొద్ది మందిలో అనన్య బిర్లా ఒకరు. ఇండియాలో బిర్లా అనే పేరు ఎంత ఫేమస్సో అందరికి తెల్సిందే. కుమార మంగళం బిర్లా ఫోర్బ్స్‌ 2023 జాబితాలో దేశంలోనే అత్యధిక సంపద కలిగిన జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. అలాంటి మంగళం బిల్లా కూతురు అనన్య బిర్లా ఆశ్చర్యకరంగా సొంత వ్యాపారం నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్నారు.

అమెరికన్ స్కూల్‌ ఆఫ్ బాంబే లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన అనన్య ఉన్నత చదువుల కోసం యూకే లోని ఆక్స్ ఫర్డ్స్ విశ్వవిద్యాలయం కి వెళ్లింది. ప్రస్తుతం పలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు.

సొంతంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి తనకంటూ ప్రత్యేక వ్యాపార సామ్రాజ్యంను ఏర్పాటు చేసుకున్నారు.

చిన్న వయసులోనే వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ను ఏర్పాటు చేసిన అనన్య ఒక ప్రొఫెషనల్‌ సింగర్ కూడా. ఆమె లివిన్‌ ది లైఫ్‌ తో పాటు హోల్డ్‌ ఆన్‌ అనే మ్యూజిక్ ఆల్బమ్స్ తో సింగర్ గా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులను ప్రశంసలు దక్కించుకున్నారు.

అంతే కాకుండా ఆమె మానసిక సమస్యల నిపుణురాలు.. సోషల్‌ వర్కర్‌. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వేలాది మంది యువతకు చేయూతను అందించే విధంగా స్పీచ్ లు ఇస్తూ ఉంటారు. చిన్న వయసు నుండే తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న అనన్య బిర్లా నిజంగా గ్రేట్‌ కదా..!

Similar News