ఏ రాష్ట్ర విభజన కారణంగా పాతాళానికి కూరుకుపోయారో.. అదే విభజన అంశాల ఆధారంగా మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలని ఏపీ కాంగ్రెస్ విపరీతంగా కసరత్తు చేస్తోంది. తాము చేసింది తప్పు అని.. పెద్ద పొరపాటన్న విషయాన్ని ఇంతవరకూ నోటిమాటగా కూడా చెప్పని ఏపీ కాంగ్రెస్.. ఎదుటోళ్ల తప్పుల్ని హైలెట్ చేయాలని తాపత్రయపడుతోంది.
విభజన పాపాన్ని తుడిచేసుకోవటం కన్నా.. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయాన్ని ప్రస్తావిస్తూ.. క్రెడిట్ కొట్టేయాలని భావిస్తోంది. విభజన సమయంలో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేసిన కాంగ్రెస్.. కీలకమైన ఏపీ రాజధాని.. అందుకు అవసరమైన నిధులు.. ఆర్థిక లోటు లాంటి విషయాలపై కనీస అవగాహన కూడా కల్పించలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో తరచూ ప్రస్తావిస్తున్న ఏపీకి ప్రత్యేకహోదా హామీని అంశాన్ని సైతం నాడే చట్టబద్ధం చేసేసి ఉంటే ఈ రోజు ఇన్ని పోరాటాలు చేయాల్సి వచ్చేది కాదు.
అయితే.. ఆ విషయాల్ని పెద్దగా పట్టించుకోని ఏపీ కాంగ్రెస్.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్ మీద పలు నిరసన కార్యక్రమాలకు తెర తీస్తుంది. ఇందులో భాగంగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఏపీ అధికారపక్ష అధినేత.. బీజేపీ అగ్రనేతల ఫోటోలు ఉండటం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన పోస్టర్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోను.. కేంద్రమంత్రి వెంకయ్య ఫోటోలను పైభాగంగా ప్రముఖంగా ప్రచురించిన వారు.. అదే రీతిలో ఏపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు.. సుజనాచౌదరి.. నిర్మలా సీతారామన్ ఫోటోల్ని ప్రచురించారు. కోటి ఎస్ ఎంఎస్ ల నినాదంతో ఏపీకి ప్రత్యేకహోదా విషంపై తమ నిరసనను తెలియజేయాలన్న ఆలోచనతో కోటి ఎస్ ఎంఎస్ ల కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇంతకీ ఈ కోటి ఎస్ ఎంఎస్ లు.. పోస్టర్ లో ప్రచురించిన ఐదుగురు నేతలకు పంపాలని పేర్కొంది. పంపించటం సంగతి బాగానే ఉన్నా.. ఈ ఐదుగురికి సంబంధించిన ఫోన్ నెంబర్ల మాటేమిటి? ఎస్ ఎంఎస్ లు పంపమని చెప్పగానే సరికాదు కదా. సదరు నేతల ఫోన్ నెంబర్లు కూడా తెలియాలి కదా? చూస్తుంటే.. ఏపీ కాంగ్రెస్ నేతలకు ప్రచారం మీద కాంక్ష తప్పించి.. మరేది కనిపిట్లేదే..?