రాష్ట్ర విభజన అనంతరం ఏపీ - తెలంగాణ మధ్య ప్రతి విషయంలోనూ పోటీయే... ప్రభుత్వ సంస్థల పంపిణీ - నీటి వాటాలపైనే కాక పారిశ్రామిక సంస్థల ఆకర్షణలోనూ ఈ రెండు రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఈ పోటీలో ఓ సారి తెలంగాణాది పైచేయిగా నిలిస్తే... మరోమారు ఏపీ విజయం సాధిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం తెలంగాణపై పైచేయి సాధించింది. ‘హీరో మోటో కార్ప్’ కొత్తగా ఏర్పాటు చేయనున్న మోటార్ సైకిళ్ల ప్లాంటును చేజిక్కించుకోవడంలో ఏపీ సక్సెస్ అయింది. తెలుగు నేలపై ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిన ‘హీరో మోటో కార్ప్’ యాజమాన్యం ముంజాల్ గ్రూప్ తొలుత తెలంగాణ సర్కారును సంప్రదించింది. ఈ క్రమంలో ఆ సంస్థకు రెడ్ కార్పెట్ పరచిన తెలంగాణ సర్కారు హైదరాబాదు సమీపంలోని మెదక్ జిల్లాలో స్థలం కేటాయింపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ ఆ సంస్థ మాత్రం తన నిర్ణయం మార్చుకుని ఏపీలోకి ఎంటరైంది.
రాయితీల విషయంలో తెలంగాణ సర్కారు కంటే ఏపీ ఆపర్లు ఎక్కువగా ఇవ్వడంతోనే హీరో సంస్థ తన రూటు మార్చుకుందని తెలుస్తోంది. ఏపీ సర్కారు భూమితో పాటు రాయితీలు కూడా ఇస్తామని హీరో మోటో కార్ప్ కు సమాచారం పంపడంతో సీను ఒక్కసారిగా మారిపోయిందని.. ఏపీ సర్కారు వడివడిగా అడుగులు వేయడంతో తెలంగాణకు ఛాన్సు పోయిందని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో అందుబాటులో ఉన్న భూమిని ఆ సంస్థ ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం చూపింది. సదరు భూమికి ‘హీరో’ ఓకే అనగానే... అక్కడ 600 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయిస్తూ నిన్నటి కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా సాఫ్టువేర్ కంపెనీల విషయంలో తెలంగాణది పైచేయి అవుతున్న తరుణంలో ఏదైనా ప్రధాన కంపెనీని ఏపీకి రప్పించాలని చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే హీరోసంస్థకు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య రాయితీల విషయంలో సంప్రదింపులు కొలిక్కి రావడంలేదన్న సమాచారం అందగానే ఏపీ తరఫున అధికారులు ఎంటరై ఆఫర్లతో ‘హీరో’ ను సంప్రదించారు. అది వర్కవుట్ కావడంతో హీరో తెలంగాణకు టాటా చెప్పి ఏపీకి ఓకే చెప్పింది.