ఏపీకి రాజధానిగా అమరావతి ఉండి ఉంటే ఈ పాటికి వెల్లువలా పెట్టుబడులు వచ్చి ఉండేవని అంతా అంటారు. ఒప్పుకుంటారు. దానికి కారణం తెలుగు నేల నుంచి అమెరికా వెళ్లి రెండు చేతులా సంపాదిస్తున్న తెలుగు వారు భూములు విస్తారంగా కొనేవారు. అలా ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ వచ్చేది. అంతే కాదు ఏపీలో ఈ పాటికి అమరావతి రాజధాని ఒక రూపూ షేపూ వస్తే కనుక ఏపీలోని ఇతర ప్రధాన నగరాలకు ఈ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు విస్తరించి దండీగా సర్కార్ కి ఆదాయంతో పాటు పెట్టుబడులు వచ్చేవి. కనీ టీడీపీ హయాంలో మొదలైన అమారావతి రాజధాని వైసీపీ ఏలుబడిలో ఆగిపోయింది.
అంతే కాదు మూడు రాజధానులు అంటూ వైసీపీ తీసుకున్న కొత్త స్లోగన్ కూడా అతీ గతీ లేకుండా ఆగిపోయింది. దాంతో ఏపీ వంటి కొత్త రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు అంతా మనసు మార్చుకున్నారు. అంతే కాదు ఏపీలో రాజకీయ పలుకుబడి ముందు వ్యవస్థలు బలాదూర్ అయి కుదేల్ అవుతున్న నేపధ్యంలో ఎక్కడ భూములు కొన్నా వాటిని ఎంచక్కా కబ్జాలు చేసేయడం, కొన్ని చోట్ల కత్తి పెట్టి మరీ తమకు నచ్చిన రేటుకు అమ్మాలని దౌర్జన్యాలు చేయడం, ఇలా అనేక రకాలుగా భూములకు రెక్కలు కట్టించి లేపుకుపోతున్న పరిస్థితిని చూసి బెంబేలెత్తిపోయారు.
ఇలా అనేక కారణాలవల్ల అమెరికా నుంచి ఆంధ్ర నాట వరదై పారాల్సిన రియల్ పెట్టుబడులు సడెన్ గా ఆగిపోయాయి. ఈ పరిణామాలు అన్నీ కూడా ప్రవాస ఆంధ్రుల మైండ్ సెట్ ని ఒక్కసారిగా మార్చేశాయి. నిజానికి హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందింది అంటే ప్రవాసంలో ఉన్న తెలుగువారే దానికి కారణం. అలా భూముల ధరలు పెరిగి ఆదాయ మార్గాలు అధికమై అభివృద్ధి విస్తరించడం వెనక అమెరికా వంటి దేశాలల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ డబ్బుని తెచ్చి ఇక్కడ పోగేయడం వల్లనే కారణం ఉంది.
ఒకనాడు ఎంతటి అమెరికా ఇతర దేశమైనా కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ తమ సొంత దేశంలో రాష్ట్రంలో భూములు కొని స్థిరాస్తులు పెంచుకుని ఆ తరువాత తాము తాపీగా సొంత గడ్డకు వచ్చి సెటిల్ కావచ్చు అన్న ఆలోచన ఉండేది. ఇపుడు అమెరికా లో ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహం మారిన పరిస్థితులు అన్నీ కలసి అమెరికాలో ఆంధ్రులతో సహా తెలుగువారి ఆలోచనలు మారేయా చేశాయని అంటున్నారు. ఇప్పటిదాకా ఆతిధ్య రంగంలోనే పెట్టుబడులు పెట్టే ప్రవాస భారతీయులు, అందునా అంధ్రులు ఇపుడు రియల్ ఎస్టేట్ రంగంలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు.
అలాగే నిర్మాణం రంగంలో కూడా తమ వాటాను పెంచుకుంటున్నారు. దీంతో డల్లాస్ లో 15వేల ఎకరాలు, ఆస్టిన్‌లో 20 నుంచి 30 వేల ఎకరాలు, హ్యూస్టన్‌లో 10వేల ఎకరాలకు పైగా ఈ రోజునాటికి తెలుగువారి చేతుల్లో ఉన్నాయని లెక్కలు చెబుతూంటే అది గర్వంగా ఉంది. అదే టైం లో నాష్ విల్, అట్లాంటా, తాంపా, ర్యాలీ, మయామి, బోస్టన్, ఫీనిక్స్ వంటి పెద్దనగరాలలో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తెలుగువారు తమ సత్తా చూపుతున్నారన్న సమాచారం కూడా అనాందించతగినదే.
మరో వైపు నిర్మాణ రంగంలో కూడా వంద రెండు వందల యూనిట్లను నిర్మిస్తూ తెలుగు వారు దూసుకుపోతున్నారు. ఇలా అమెరికాలో తామేంటో చూపిస్తున్నారు. తమ పెట్టుబడులను అన్నింటికీ అక్కడే పెడుతూ అమెరికా వృద్ధికి తమ స్వీయ అభివృద్ధికి కూడా కారణం అవుతున్నారు. కడుపులో చల్ల కదలకుండా తామున్న చోటనే రియల్ వ్యాపారం చేసుకుంటూ అక్కడే అధిక ఆర్జన సాధిస్తున్నారు. ఈ పరిణామాలను కనుక అంచనా వేసుకుంటే రానున్న రోజులలో మొత్తం అమెరికా రియల్ ఎస్టేట్ రంగాన్నే శాసించే విధంగా మన వారు ఎదుగుతారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే అంతా సవ్యంగా ఉంటే అమరావతి రాజధాని కనుక ఒక దశకు చేసుకుని ఉంటే అమెరికాలోని ఆంధ్రుల నుంచి ఏకంగా యాభై వేల కోట్లకు తక్కువ కాకుండా పెట్టుబడులు ఆంధ్రాకు వచ్చేవని అంటున్నారు. ఇపుడు అంత చక్కని అవకాశాన్ని ఆంధ్రా కోల్పోయింది. అదే సమయంలో అమెరికాలో సెటిల్ అయిన ఆంధ్రులకు కొత్త ఆలోచనలు కొత్త దారులూ దొరికాయి. దాంతో వారు నానాటికీ అల్లుకుపోతున్నారు. మరి ఈ మొత్తం ఎపిసోడ్ లో భారీ నష్టం కష్టం ఎవరికీ అంటే ఈ రోజుకీ రాజధాని అంటూ ఒకటి లేని ఆంధ్రులకే. అంధ్ర రాష్ట్రానికే అన్నది నిష్టుర సత్యం.