ఏపీలో వైరస్ విజృంభణ.. కొత్తగా మరో 793 కేసులు, 11 మంది మృతి !

Update: 2020-06-29 11:50 GMT
ఆంధ్రప్రదేశ్ ‌లో వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. సోమవారం మరో 793 మందికి వైరస్ నిర్దారణ కాగా.. మరో 11 మంది ఈ మహమ్మారి కారణంగా బలయ్యారు. దీంతో రాష్ట్రంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 13,891కి చేరింది. అలాగే రాష్ట్రంలో వైరస్ మరణాలు 180కి చేరాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 793 కేసులు నిర్ధారణ కాగా.. వీరిలో ఏపికి చెందినవారు 706 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 81 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఆరుగురు ఉన్నారు.

24 గంటల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 113 కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం-96, చిత్తూరు-56, తూర్పు గోదావరి-72, గుంటూరు-98, కడప-71, కృష్ణా-52, కర్నూలు-86 నెల్లూరు-24, ప్రకాశం-26, విశాఖపట్నం-11, విజయనగరం-1, కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళంలో కొత్తగా కేసులు నమోదు కాలేదు. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారి వల్ల 81, విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఆరు కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి 6,232 మంది కోలుకోగా.. వివిధ ఆస్పత్రుల్లో 7,479 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లో 30,216 శాంపిళ్లను పరీక్షించారు. 24 గంటల వ్యవధిలో 30 వేల శాంపిళ్లను పరీక్షించడం ఇది రెండోసారి. ఇది వరకు 36 వేలకు పైగా శాంపిళ్లను వైద్యాధికారులు పరీక్షించారు. గరిష్ఠ స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని, ఫలితంగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని స్పష్టం చేశారు. వైరస్ పరీక్షల్లో రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచీ ఇప్పటిదాకా 8,72,076 మందికి పైగా శాంపిళ్లను సేకరించి, పరీక్షించినట్లు వెల్లడించారు
Tags:    

Similar News