కొత్త‌గా 796 పాజిటివ్‌, 11మంది మృతి: ఏపీలో క‌ల్లోలం రేపుతున్న వైర‌స్‌

Update: 2020-06-27 16:30 GMT
ల‌క్ష‌ల సంఖ్య‌లో టెస్టులు చేస్తున్నా కేసులు మాత్రం వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. టెస్టులు పెంచిన‌ట్టు కేసులు కూడా విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేసులతో పాటు ఇప్పుడు మృతులు కూడా పెరుగుతున్నారు. తాజాగా 740 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఏకంగా 11మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల్లో రాష్ట్రానికి చెందిన 740 ఉండ‌గా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 51, ఇతర దేశాల నుంచి వచ్చినవి 5 ఉన్నాయ‌ని శ‌నివారం వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

వీటితో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 12,285కు చేరింది. మరణాల సంఖ్య 157. తాజాగా వైర‌స్ నుంచి 263 మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకుని డిశ్చార్జ‌యిన వారి సంఖ్య 5,289. ప్ర‌స్తుతం యాక్టివ్ ఉన్న కేసులు 6,648. వీరంతా ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా అనంతపురము జిల్లాలో 161, తూర్పుగోదావరి జిల్లాలో 109 న‌మోద‌య్యాయి. మిగ‌తా జిల్లాల్లో చిత్తూరు 84, గుంటూరు 71, కర్నూలు 69, కృష్ణా 53, వైఎస్సార్ కడప 50, పశ్చిమగోదావరి 44, విశాఖపట్నం 34, ప్రకాశం 26, నెల్లూరు 24, విజయనగరం 15 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో అత్యధికంగా కేసులు న‌మోదైన జిల్లా కర్నూలు. ఈ జిల్లాలో 1,684 కేసులు ఉన్నాయి.
Tags:    

Similar News