అందానికి అందం.. కొదవలేని పేరు ప్రఖ్యాతులు.. అంతులేని సంపదే కాదు.. అంతకు మించిన పెద్ద మనసు.. గుండె ధైర్యం సొంతం హాలీవుడ్ భామ ఏంజెలీనా జోలిది. అందానికి నిలువెత్తురూపంగా చెప్పే ఈ భామ సాహసం వింటే నోటి వెంట మాట రాదు. ఇవాల్టి రోజున ఎక్కడైనా కాస్తంత కలకలం రేగినా.. వెంటనే సేఫ్టీ గురించి మాట్లాడుకోవటం.. అలాంటి చోట్లకు వెళ్లటం ఏమాత్రం సేఫ్ కాదని స్టైల్ స్టైల్ గా చెప్పుకునే పరిస్థితుల్లో అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే శరణార్థుల శిబిరాన్ని సందర్శించి తన పెద్ద మనసును చాటుకుంది.
సిరియా యుద్ధం ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి చెందిన దాదాపు 40 లక్షల మంది ప్రజలు.. దేశాన్ని విడిచి పెట్టి.. లెబనాన్.. జోర్డాన్.. టర్కీ దేశాల్లో తలదాచుకున్న పరిస్థితి. స్వదేశంలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం కాని దేశానికి వచ్చేసి.. బిక్కుబిక్కుమంటున్న వారిని సందర్శించటం.. వారి కోసం పని చేస్తున్న ఏంజెలీనా తాజాగా మరోసారి ఆ ప్రాంతంలో సందర్శించారు. శిబిరాల్లో తలదాచుకుంటున్న శరణార్ధులతో మాట్లాడటం.. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
స్టార్ట్ నటీమణిగా ఉంటూ.. పెద్ద సెలబ్రిటీగా వ్యవహరించే చాలామందికి లేని పెద్ద మనసు ఏంజెలీనా సొంతం. అనాధ పిల్లల్ని దగ్గరకు తీయటం.. వారిని దత్తత తీసుకోవటం ఆమెకు అలవాటే. ఆఫ్రికా దేశానికి చెందిన ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకున్న ఆమె.. సిరియాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు అనాధలైతే వారిలో ఒకరిని దత్తత తీసుకొని తన పెద్ద మనసును చాటింది. ఇలాంటి మనస్తత్వంతోపాటు.. అంత ధైర్యం కొమ్ములు తిరిగిన మగాళ్లుగా చెప్పుకునే సూపర్ హీరోల్లో కూడా కనిపించదు కదూ.