ఉమ్మడి ఏపీలో ఉన్నపుడు కానీ, విడిపోయిన తరువాత కానీ సినిమా ఇండస్ట్రీ కి పాలిటిక్స్ మీద గానీ పాలిటికల్ గా కానీ పెద్దగా పని పడలేదు. ఇక చిరంజీవి 2009 ఎన్నికలలో పార్టీ పెట్టినపుడు కూడా ఆయన పార్టీలోకి సినీ సీమ నుంచి ఎవరూ వెళ్ళిన సందర్భాలు లేవు. ఇక పవన్ కళ్యాణ్ తరఫున కూడా ఈ రోజుకీ ఎవరూ ముందుకు రావడంలేదు. సినిమా పరిశ్రమ నుంచి పవన్ కి పెద్దగా సపోర్ట్ చేసిన పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు.
అయితే టీడీపీ కొంచెం సినిమా పరిశ్రమకు దగ్గరగా ఉన్నది అన్నది వాస్తవం. అది కూడా టీడీపీని పెట్టినది ఎన్టీయార్ కాబట్టి అప్పటి నుంచి టీడీపీ ఉన్న మద్దతుని అలా కొంచెం నిలుపుకుంటూ వస్తోంది. అయితే 2004 ఎన్నికలలో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయనకు సినీ రంగం సపోర్ట్ చేయకపోయినా సినిమా పరిశ్రమ మీద ఆయన కక్ష కట్టలేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆయన అలా వారి మానన వదిలేశారే తప్ప పెద్దగా పట్టించుకోలేదు. అలా చిత్ర సీమ కార్యకలాపాలు సాఫీగా సాగిపోయాయి.
ఒక సందర్భంగాలో వైఎస్సార్ కూడా సినీ పరిశ్రమ మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను సినిమాలు చూడను, ఎప్పుడో ఒకసారి ఒక సినిమా చూశానని ఆయన నాడు పేర్కొనడం జరిగింది. ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణాలో కేసీయార్ ను కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోకపోయేసరికి కొంత గ్యాప్ అయితే మొదట్లో వచ్చింది. ఆ తరువాత ఏమైందో కానీ సినీ రంగానికి చెందిన పెద్దలు వెళ్ళి కేసీయార్ ని కలసి టీయారెస్ ప్రభుత్వంతో సాన్నిహిత్యం నెరిపారు.
ఆ విధంగా చక్కని వాతావరణం అయితే నాటి నుంచి ఏర్పడింది. అయితే ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. సినీ పరిశ్రమ పూర్తిగా హైదరాబాద్ లో లోకేట్ అయి ఉంది. ఇక రాష్ట్రం విడిపోయాక టాలీవుడ్ ఏపీలో కూడా విస్తరిస్తుందని అంతా అనుకున్నారు, కానీ ఆ విధంగా గత ఏడేళ్లలో పెద్దగా ప్రయత్నాలు అయితే జరగలేదు అనే చెప్పాలి.
ఇక 2019 ఎన్నికల తరువాత పూర్తి ఏకపక్ష విజయంతో అధికారంలోకి వచ్చిన జగన్ తో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దగా సంబంధాలు పెట్టుకోలేదు. అదే సమయంలో టాలీవుడ్ పెద్దలు అనే వారు కూడా కలిసింది తక్కువే అని చెప్పాలి. దీనికి కారణం ఏంటి అంటే టాలీవుడ్ అక్కడ లేదు. కేవలం సినిమా థియేటర్లు మాత్రమే ఉన్నాయి. థియేటర్ వ్యవస్థ అన్నది పూర్తిగా డిస్ట్రిబ్యూటర్లతోనే కలసి ఉంటుంది. టాలీవుడ్ పెద్దలతో వారికి నేరుగా అయితే సంబంధాలు లేవు.
ఇలా టాలీవుడ్ పెద్దలకు ఏపీ ప్రభుత్వ పెద్దలతో అంతగా అవసరాలు అయితే పడలేదు అనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే ఏపీ సీఎం జగన్ని పట్టించుకోలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అది అలా నెమ్మదిగా పెరిగి పెద్దది అయి చివరకు ఇగోస్ దాకా కధ వచ్చేసింది. ఇపుడు ఏకంగా ఏపీలో థియేటర్ల మీద ప్రభుత్వం పెత్తనం చేయడం దాకా పరిస్థితి వెళ్తోంది అంటే దానికి ఈ అతి పెద్ద గ్యాప్ ప్రధాన కారణం అనే చెప్పాలి.
దీనిని అంతా విశ్లేషించుకుంటే ఏపీలో సినిమాకు ఇపుడు కష్టాలు వస్తున్నాయి అంటే దానికి ఇద్దరి తప్పూ ఉందనే విశ్లేషించాల్సి ఉంటుంది అని కొందరు పెద్దలు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా అటూ ఇటూ కూడా ఇగోస్ ని పక్కన పెట్టి ముందుకు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరి బాగు కోసం ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచిస్తున్నారు. అటూ ఇటూ కూడా కలసి కూర్చుని సర్దుబాటు చేసుకుని సామరస్యంగా వ్యవహరిస్తే బాగుంటుంది అన్న సూచనలు వస్తున్నాయి.
అదే టైమ్ లో ప్రభుత్వ పెద్దలు కూడా వైఎస్సార్ మాదిరిగా ఆలోచన చేయాలని, సినీ పరిశ్రమ విషయాల్లో పట్టింపులకు పోకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తే బాగుంటుందని కోరుతున్నారు. సినిమా అన్నది ఈ రోజుకు కూడా సామాన్యుడికి అతి ప్రధానమైన వినోదం, సినిమా అన్నది ఒక విధంగా అద్భుతం. ఎన్ని సాధనాలు ఉన్నా ఎంత సాంకేతిక సంపత్తి ఉన్నా కూడా సినిమాను థియేటర్లో చూస్తే వచ్చే ఆనందం వేరు. మరి అది జరగాలన్నా సినిమా బతికి బట్టకట్టాలన్నా కూడా రెండు వైపుల నుంచి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక టాలీవుడ్ పెద్దలు కూడా ఏపీలో మూలాలు కలిగి ఉన్నావారు అన్న సంగతిని మరవరాదు, ఏపీ విభజన గాయాలతో బాధపడుతున్న రాష్ట్రం. పైగా తుఫాన్లకు కేంద్రంగా ఉన్న తీర ప్రాంతం. ఏడాదిలో అనేక సార్లు ప్రకృతి విపత్తులు వస్తూంటాయి. తాము పుట్టిన నేలకు తమ వంతుగా సాయానికి వారు ముందుకు రావాలి. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా తమ వంతుగా ఇతోధిక సాయం చేయాలి.
సినిమా అన్నది ఫక్తు బిజినెస్. అందువల్ల వ్యాపారం చేసేవారు పట్టు విడుపులతో ఉండాలి. రాజకీయాల్లో ఉన్న వారికి కొంత ఇగో ఉంటుంది. దాన్ని అర్ధం చేసుకుని కలుపుకుని పోయేలా వ్యవహరించాలి. ఒక అడుగు టాలీవుడ్ ఈ దిశగా వేస్తే ప్రభుత్వం నుంచి రెండడుగులు పడతాయని ఆశించవచ్చు. ఆ మీదట సినీరంగానికి ప్రభుత్వానికి మధ్య ఏర్పాడినది కేవలం అపోహ మాత్రమే అని టీ కప్పులో తుఫానులా అది ఆవిరి అయిపోక తప్పదని అంతా అంటున్నారు. సో ఆ దిశగా అటూ ఇటూ ప్రయత్నాలు గట్టిగా చేయాలని సినీ ప్రేమికులు అంతా కోరుకుంటున్నారు.