ఏపీ జీవధారగా చెబుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు ఇక పరుగులు పెట్టనున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక తప్పిదాలను సరిచేస్తూ.. వైసీపీ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజల ముందు ఉంచుతూనే.. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎలాగైనా.. 2021 నాటికి ఏపీ ప్రజలకు పోలవరం ప్రాజెక్టు ఫలాలను అందించాలన్న దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నారు.
ఈ మేరకు పరిపాలనా సౌలభ్యం కోసం పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం) చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబుకు కుడి - ఎడమ కాలువల పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లో సభ్యునిగా కూడా సుధాకర్‌బాబును నియమించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్–ఇన్–చీఫ్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపారుదల విభాగం ఇంజనీర్–ఇన్–చీఫ్ ఎం.వెంకటేశ్వరరావును అదనపు బాధ్యతల నుంచి తప్పించారు.
కాగా, రెండు బాధ్యతలను ఒకరే నిర్వహిస్తుండటం వల్ల పనిభారం పెరిగి ప్రాజెక్టు పనులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసకుంది. నిజానికి.. ఇదే విషయాన్ని గుర్తించి - ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఇంజనీర్–ఇన్–చీఫ్ ను నియమించాలంటూ జూలై 11 - 2017న కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై కేంద్రం - పీపీఏ కూడా లేఖలు రాసినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దానిని సరిచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా పలు తప్పిదాలను సరిచేస్తూ కలల ప్రాజెక్టును ప్రజల కళ్లముందు ఉంచేందుకు నడుంబిగించింది.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు హెడ్ వర్క్స్ - జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు కొత్త ప్రభుత్వం ఇప్పటికే రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. పోలవరం పనుల పర్యవేక్షణ - పీపీఏతో సమన్వయం - కేంద్ర జలవనరుల శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో పోలవరం ఈఎన్ సీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపారుదల విభాగం ఈఎన్ సీ ఎం.వెంకటేశ్వరరావును వాటి నుంచి తప్పించి - పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను ప్రస్తుతం హెడ్ వర్క్స్ ను పర్యవేక్షిస్తున్న సీఈ సుధాకర్ బాబుకే పూర్తిగా అప్పగించింది. దీంతో అదనపు భారం లేకపోవడంతో ప్రాజెక్టు పనులు ఇంకా వేగంగా పూర్తి అవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.