మీడియా మొఘల్.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోడలకు పదవి లభించింది. మార్గదర్శి చిట్స్ ఎండీగా సుపరిచితురాలైన శైలజా కిరణ్ ను శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీకి సభ్యులుగా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. నిజానికి ప్రభుత్వం నుంచి నేరుగా పదవులు చేపట్టటం రామోజీ ఫ్యామిలీలో లేదని చెబుతారు. ఇలాంటి వాటికి దూరంగా ఉంటారన్న మాట వినిపించేది.
కానీ.. ఇందుకు భిన్నంగా రామోజీ పెద్ద కోడల్ని వర్సిటీ పాలకమండలి సభ్యురాలిగా ఎంపిక చేయటం ఆసక్తికరంగా మారింది. ఈనాడు ఎండీ కిరణ్ సతీమణే శైలజా కిరణ్ అన్నది తెలిసిందే. ఏపీలోని 11 యూనివర్సిటీలకు పాలక మండలి సభ్యులను ఎంపిక చేస్తూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన శైలజా కిరణ్ ను.. అదే జిల్లాలోని పద్మావతి యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలిగా ఎంపిక చేయటం గమనార్హం.