ఏపీలో సర్కారు భూముల అమ్మకం.. కోర్టు తీర్పు ఇదే!

Update: 2021-04-23 09:37 GMT
అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు నిధులు స‌మీక‌రించ‌డంలో భాగంగా.. అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు ప్ర‌భుత్వాలు భూముల‌ను విక్ర‌యిస్తుంటాయి. ప్రైవేటు వ్య‌క్తుల‌కు స‌ర్కారు భూములు విక్ర‌యించి నిధులు స‌మ‌కూర్చుకుంటాయి. ఏపీ ప్ర‌భుత్వం కూడా ఇదే విధంగా భూముల అమ్మ‌కానికి సిద్ధ‌ప‌డింది. అయితే.. ఈ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖ‌లైంది.

రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన విశాఖ‌లో ఐదు చోట్ల ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కానికి స‌ర్కారు నోటిఫికేష‌న్ ఇచ్చింది. దీన్ని స‌వాల్ చేస్తూ కొంద‌రు కోర్టు మెట్లెక్కారు. అయితే.. తాజాగా ఈ కేసును హైకోర్టు విచారించింది. ఇరు వ‌ర్గాల‌ వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం.. ఈ అమ్మ‌కాల‌పై స్టే ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

గ‌తంలో బిల్డ్ ఏపీ పేరుతోనూ స‌ర్కారు భూముల అమ్మ‌కాల‌కు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. అయితే.. అప్పుడు కూడా న్యాయ‌స్థానం స్టే ఇచ్చింది. అప్పుడు ఇచ్చిన ఆదేశాలే.. ప్ర‌స్తుత విశాఖ భూముల అమ్మ‌కాల‌కూ వ‌ర్తిస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. అదేవిధంగా.. టెండ‌ర్లు ఫైన‌ల్ చేయ‌కుండా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది హైకోర్టు.
Tags:    

Similar News