రోజమ్మా...సొంత పార్టీలోనే ముళ్ళున్నాయే...

Update: 2022-11-13 03:48 GMT
మినిష్టర్ రోజా అనిపించుకోవాలనుకున్నారు. అలాగే మంత్రి అయిపోయారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఇపుడు అసలైన కధ మొదలైంది. వచ్చే ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరి ముచ్చటగా మూడవసారి నగరిలో రోజా గెలిచేనా. ఇది వేయి డాలర్ల ప్రశ్న కానే కాదు. జవాబు బహు సులువు. రోజా గెలవదు అంటున్నారు సొంత పార్టీ వారే.

దానికి కారణం ఆమె ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ప్రమోషన్ కొట్టేసినా సొంత పార్టీ వారి మనసులు గెలవడంలేదు అంటున్నారు. ఇంకా చెప్పాలీ అంటే శత్రువులు బయట కంటే పార్టీ లోపల ఎక్కువ అయిపోయారు అని కూడా అంటున్నారు. దాంతో రోజాకు ముళ్ళు ఎక్కడో లేవు తన చుట్టే అని అర్ధమవుతోంది.

కానీ ఆమె దానికి రిపేర్లు చేసుకోవడం అటుంచి కొత్త తలకాయ నొప్పులు ఎన్నో పెట్టుకుంటున్నారు. ఎటూ నగరి నియోజకవర్గంలో టీడీపీ స్ట్రాంగ్ అవుతోంది. జనసేన కూడా అక్కడ గట్టిగానే ఉంది. ఇపుడు వైసీపీలో రోజా యాంటీ బ్యాచ్ అంతకంతకు పెరుగుతోంది. దానికి లేటెస్ట్ ఉదాహరణ ఒకటి చూస్తే చాలు కధ ఎలా ఉందో సింపుల్ గా అర్ధమైపొతుంది.

రోజా తిరుపతి జిల్లా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు గ్రామ సచివాలయాన్ని ప్రారంభించాలని రోజా గట్టిగానే పట్టుబట్టారు. అయితే వైసీపీకే చెందిన జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి వీలు కాదు అనేశారు. అంతే కాదు ఆయన చెప్పిన విషయాలు పెట్టిన కండిషన్లూ కూడా రోజమ్మకు ఆవేశం పెంచేలా చేశాయట. ఆర్బీకే, పాల శీతలీకరణ కేంద్రం ఒకే ప్రాంగణంలో నిర్మించారు. ఇందుకోసం ఏకంగా 34 లక్షల రూపాయలు ఖర్చయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు.

అందులో నుంచి చూస్తే ఇప్పటికీ 23 లక్షల రూపాయల  బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ముందు వాటిని చెల్లించి అపుడు ఓపెనింగ్ చేసుకోవచ్చు అని  మురళీధర్ రెడ్డి రోజా వర్గానికి క్లారిటీగా చెప్పేశారు. అంతే కాదు ఇద్దరు మంత్రులు అయిన నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను కూడా ఓపెనింగ్ కి పిలవాలని కూడా కోరారు.

అంతవరకూ ఈ ఊసే తలవద్దు అని చెప్పేశారు. అయితే రోజా వర్గం సచివాలయానికి వేసిన తాళాలు పగులగొట్టేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అడ్డు వచ్చిన మురళీధర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రవిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మీదట మినిస్టర్ రోజా సచివాలయం ప్రారంభించేశారు.

అంతవరకూ బాగానే ఉంది. పంతంతో రోజా తాను అనుకున్నది చేయగలిగారు కానీ ఆమె సొంత పార్టీ వారికే మరింత చెడ్డ అయ్యారు. మరి దీనిని ఎలా ఆమె పరిష్కరించుకుంటుంది అన్నదే చర్చగా ఉంది. అయితే నగరి వైసీపీలో ఉన్న వర్గ పోరు పీక్స్ కి చేరిన వేళ ఇక సయోధ్య కుదరదు అంతే అంటున్నారు.

రోజాను పెడితే మంత్రిగా ఆమె ఓడిపోయే సీటు అదే అవుతుంది. దాంతో ఆమెను తప్పించి ఎవరికైనా సీటు ఇస్తారా అన్నదే ప్రశ్న. ఏది ఏమైనా రోజాకు ముళ్లు గుచ్చుకుంటున్నాయి. అవి సొంత వారి నుంచే. దాంతో పొలిటికల్ ఫ్యూచర్ కష్టమే అన్నదే టాక్.
Tags:    

Similar News