దేశంలోనే ఏపీ పోలీసులు మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ & క్లియరెన్స్ లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకున్నారు. నేరస్థులను పట్టుకోవడంలో టెక్నాలజీ ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తోన్నవారు తాజాగా అవార్డు దక్కించుకుని తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన రీతిలో పాస్ పోర్ట్ సేవలను అందిస్తున్నందుకు కేంద్ర విదేశాంగశాఖ అవార్డును ప్రకటించింది.
ఈ క్రమంలో ఉత్తమ సేవలు అందిస్తోన్న పోలీస్ శాఖను సీఎం జగన్ అభినందించారు. ఆంధ్రా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ అవార్డుల్లో ఏపీకి ఫస్ట్ ప్లేస్ రాగా.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాలలో హర్యానా, కేరళలు ఉన్నాయి. దీంతో ఉభయ రాష్ట్రాల పోలీసులను.. ప్రజలు ప్రశంసిస్తున్నారు.