ల వివాదాల పరిష్కారానికి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పిన సూచనకు ఏపి ప్రభుత్వం నో చెప్పింది. వివిధ ప్రాజెక్టుల్లోని నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదంపై ఏపి ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ నేరుగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఈ కేసును పరిశీలించిన చీఫ్ జస్టిస్ తర్వాత మాట్లాడుతు కేసు విచారణకన్నా మధ్యవర్తిత్వం మేలైన ప్రక్రియగా సూచించారు.
రెండు ప్రభుత్వాలు కూర్చుని వివాద పరిష్కారం విషయమై మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని కాబట్టి ఇలాంటి సూచన చేస్తున్నట్లు కూడా ఎన్వీ రమణ తెలిపారు. అయితే ఇందుకు ఏపి ప్రభుత్వం నో చెప్పేసింది. మధ్యవర్తిత్వం కన్నా తమకు న్యాయపరమైన పరిష్కారమే కావాలని స్పష్టంగా చెప్పింది. ఇద్దరి వ్యక్తులో లేదా కుటుంబాల మధ్య సమస్యో కాదని రెండు రాష్ట్రాల మధ్య సమస్య కాబట్టి శాశ్వాత పరిష్కారం కోసమే సుప్రింకోర్టులో పిటీషవన్ వేసినట్లు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
కూర్చుని మాట్లాడుకుని పరిష్కారం చేసుకునే దశను సమస్య దాటిపోయిందని ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఏపి ప్రభుత్వం ఇంత గట్టిగా ఉండటానికి కారణం ఏమిటంటే కేసీయార్+ తెలంగాణా ప్రభుత్వ వైఖరే కారణమని ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన నీటి కేటాయింపులను కాదని తెలంగాణా ప్రభుత్వం కృష్ణానది నీటిని తనిష్టం వచ్చినట్లు వాడేసుకుంటోందని సలహాదారు ఆరోపించారు. పైగా తాగు, సాగు నీటి ప్రాధాన్యతను కావాలనే ఉల్లంఘించి జల విద్యుత్ ఉత్పత్తి చేసేసుకుంటోందన్న విషయాన్ని ఏపి ప్రభుత్వం ఫిర్యాదులో చెప్పిందన్నారు.
ఇంకా విచిత్రమేమిటంటే జలవిద్యుత్ ఉత్పత్తి చేసుకున్న తర్వాత నీటిని సముద్రంలోకి వదిలేయటంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. ఒకవైపు ఏపి జనాలు నీటికి ఇబ్బందులు పడుతుంటే మరోవైపు తెలంగాణా ప్రభుత్వం నీటిని సముద్రంలోకి కావాలనే వదిలేసిన విషయాన్ని గుర్తుచేశారు. పైగా ఎదురు ఏపి ప్రభుత్వాన్ని తప్పులు పడుతోందన్నారు.
తెలంగాణా వైఖరిని దృష్టిలో పెట్టుకునే కూర్చుని మాట్లాడుకునే స్టేజి దాటిపోయింది కాబట్టి న్యాయపరమైన పరిష్కారమే కావాలని ఏపి ప్రభుత్వం చెప్పింది. దాంతో చేసేదిలేక కేసు విచారణను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన ధర్మాసనం నుండి మరోక ధర్మాసనానికి బదిలిచేశారు. మరి కేసు విచారణలో చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.