వాట‌ర్ వార్ః స‌మ‌న్వ‌య క‌మిటీకి రాష్ట్రం డుమ్మా!

Update: 2021-08-03 09:30 GMT
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు కృష్ణా, గోదావ‌రి బోర్డుల స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేశారు అధికారులు. అయితే.. ఈ స‌మావేశానికి కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికారులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఈఎన్సీ, ట్రాన్స్ కో, జెన్ కో విభాగాల నుంచి అధికారులు పాల్గొన్నారు. కానీ.. త‌లెంగాణ రాష్ట్రం నుంచి మాత్రం హాజ‌రు కాలేదు.

కాగా.. ఈ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం గురించి జూలై 29వ తేదీనే బోర్డు వెల్ల‌డించింది. ఈ మేర‌కు 30వ తేదీన రెండు రాష్ట్రాలూ లేఖ రాసింది. అయితే.. తెలంగాణ స‌ర్కారు అభ్యంత‌రం తెలిపింది. నీటి ప్రాజెక్టుల‌ను గోదావ‌రి బోర్డు ప‌రిధిలోకి తీసుకెళ్తే.. రాష్ట్రాల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని చెప్పింది. అందుకే.. పూర్తిస్థాయి బోర్డు భేటీలో ఈ అంశం చ‌ర్చించాల్సి ఉంద‌ని పేర్కొంది. బోర్డు స‌మావేశం నిర్వ‌హించి అభిప్రాయాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు తెలుసుకోకుండా.. డైరెక్టుగా స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీలో కేంద్ర గెజిట్ పై చ‌ర్చించ‌డం స‌రికాద‌ని తెలిపింది.

అయితే.. దీనికి గోదావ‌రి బోర్డు సైతం వెంట‌నే స్పందిస్తూ.. జ‌వాబు ఇచ్చింది. గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లుకు సంబంధించి ఆగ‌స్టు 2లోగా త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కేంద్రం కోరింద‌ని, ఆ కార‌ణంగానే.. అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ నుంచి వ‌చ్చిన లేఖ‌ను ప్ర‌స్తావించింది. కృష్ణా బోర్డు కూడా ఈ విష‌య‌మై రెండు రాష్ట్రాల‌కూ లేఖ రాసింది.

కానీ.. ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో.. కృష్ణా రివ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు చైర్మ‌న్ కు తెలంగాణ స‌ర్కారు లేఖ రాసింది. పూర్తి స్థాయి బోర్డు స‌మావేశం నిర్వ‌హిస్తే హాజ‌రవుతామ‌ని తెలిపింది. దీంతో.. రెండు రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతున్న జ‌ల వివాదం ఎప్పుడు ముగుస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.
Tags:    

Similar News