'ఏరు దాటేదాక వీర మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న' అన్నట్టుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయని సాధారణ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఆది నుంచి పాటుపడిన వారిని కాదని.. అధికారంలోకి వచ్చాక చేరిన వారికే పదవులు, సీట్లు ఇచ్చి పెద్దపీట వేస్తున్న పార్టీల తీరుపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోనూ అదే కథ జరిగిందని.. పార్టీలో టీడీపీ నుంచి నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు.
అధికారం బెల్లం లాంటిది. బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు.. అధికారంలో ఉన్న పార్టీ చుట్టూ నేతలు చక్కర్లు కొడుతుంటారు. ఇలానే వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నుంచి పెద్ద ఎత్తున చేరిపోయారు. వారు ఇప్పుడు నిజమైన వైసీపీ కార్యకర్తలను మించి ఆదిపత్యం చెలాయిస్తున్నారు. అటువంటి వారిని అందలాలు ఎక్కించి అసలైన కార్యకర్తలను పట్టించుకోకపోతే చివరికి ఇబ్బంది పడేది పార్టీ పెద్దలే అని అంటున్నారు.
'తమ పార్టీలో నేటి కార్యకర్తలే రేపటి నాయకులు' అని వైఎస్ జగన్ గతంలో చెప్పారు. పది సంవత్సరాలు ప్రతిపక్షంలో కార్యకర్తలను తిప్పుకొని లాస్ట్ కు ఎన్నికల టైంకు సర్వేలు చేసి నమ్మిన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా జగన్ పెడచెవిన పెట్టాడని ఆరోపణలు క్షేత్రస్థాయి నుంచి వస్తున్నాయి. జగన్ ఎన్నికల వ్యూహకర్త పీకే టీం చెప్పిందని.. అందుకే నీకు సీటు ఇవ్వం అని చెప్పి తప్పించుకున్నారని అంటున్నారు. వాళ్ల డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు టికెట్లు, పదవులు దక్కక ఏపీలో వైసీపీ కార్యకర్తలు ఈరోజు ఎలా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు అంటున్నారు.
సీఎం జగన్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు ఏదైనా ఆయనకు సమస్య వస్తే రోడ్డున నిలిచి పోరాటాలు చేసేది నిజమైన కార్యకర్తలే తప్ప ఫిరాయించి వచ్చి మరీ పదవులు అనుభవిస్తున్న వారు కానే కాదని క్యాడర్ అంటోంది. జగన్ ఇకనైనా పార్టీని పట్టించుకుని పదేళ్ళుగా పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయాలన్న డిమాండ్ వైసీపీలో ఉంది. మరి జగన్ కి ఈ కార్యకర్త గోడు వినిపిస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.