ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది హైకోర్టులో ఆశ్చర్యకర వాదనలు వినిపించారు. చంద్రబాబుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసులో ఏసీబీ విచారణకు ఆదేశించడం - దానిని చంద్రబాబు సవాల్ చేయడంతో హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడం, దీనిపై ఆళ్ల సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఉమ్మడి హైకోర్టులో వాదించారు. ఓటుకు డబ్బులివ్వడం - ఓటు వేసేందుకు డబ్బు తీసుకోవడం అవినీతి కిందకు రాదని, కాబట్టి ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాబోదని పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో న్యాయమూర్తి టి సునీల్ చౌదరి ఎదుట సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తన వాదనలు వినిపించారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో గెలిచాక అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని వాదించారు. చంద్రబాబుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎసిబి కోర్టులో వేసిన కేసు చెల్లదని, అయినా ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించిందన్నారు. సెక్షన్ 210 కింద ఆళ్ల కేసు వేస్తే ఎసిబి కోర్టు సెక్షన్ 156(3) కింద విచారణకు ఆదేశించిందని చెప్పారు. ఈ ఆదేశాలకు ముందే తెలంగాణ ఎసిబి ఓటుకు నోటు కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు కూడా దాఖలు చేసిందని లూత్రా వాదించారు. ఒకే కేసులో రెండు ఎఫ్ ఐఆర్ లు ఎలా వేస్తారన్నారు. ఆళ్ల కేసు కారణంగా కోర్టు ఆదేశాలతో ఎసిబి మరోసారి చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుందని, ఇలా చేయడం చెల్లదన్నారు. కేసుతో సంబంధం లేని వ్యక్తి ఫిర్యాదు చేసేందుకు క్రిమినల్ చట్టంలో వీల్లేదని కోర్టుకు తెలిపారు. విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/