వారణాసి నుంచి ప్రియాంక వాద్రా పోటీ చేసే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ ఇచ్చిన లీకులపై ఇప్పుడు బీజేపీ కౌంటర్లు వేస్తోంది. తను వారణాసి నుంచి పోటీకి రెడీ అన్నట్టుగా కొన్ని రోజుల క్రితం ప్రియాంక ప్రకటించింది. తమ పార్టీ కార్యకర్తల మధ్యన ఆమె ఆ ప్రకటన చేసింది. ఇక రాహుల్ గాంధీ కూడా ఆ విషయంలో సస్పెన్స్ ను మెయింటెయిన్ చేశారు.
మోడీ మీద ప్రియాంక పోటీ చేస్తుందన్నట్టుగా రాహుల్ ప్రకటిస్తూ వచ్చారు. డైరెక్టుగా ఆ ప్రకటన చేయకపోయినా - ఆ విషయం సస్పెన్స్ అంటూ రాహుల్ ప్రకటించుకొంటూ వచ్చాడు. కట్ చేస్తే.. చివరకు ఆ విషయంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. మరో అభ్యర్థి పేరును అనౌన్స్ చేసింది. వారణాసి నుంచి మోడీ మీద ప్రియాంక పోటీ చేయడం లేదని అలా కాంగ్రెస్ స్పష్టం చేసినట్టుగా అయ్యింది.
ఈ నేపథ్యంలో బీజేపీ రియాక్ట్ అవుతూ ఉంది. 'ప్రియాంకను వారణాసి నుంచి పోటీ చేయించలేదేం…'అంటూ బీజేపీ వాళ్లు అంటున్నారు. వారణాసిలో ప్రియాంక పోటీ చేయాల్సిందని - అప్పుడు ఆమెను తాము ఓడించేవాళ్లం అని బీజేపీ ముఖ్య నేత అరుణ్ జైట్లీ కూడా అన్నారు.
మోడీ మీద ప్రియాంక పోటీ అంటూ లీకులు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్లపై బీజేపీ నేతలు ఇలా కౌంటర్లు వేస్తున్నారు. ఆ విషయంలో వెనక్కు తగ్గిన వైనం పై ఎద్దేవా చేస్తూ ఉన్నారు!