మోడీ రాజీనామాని మర్యాదగా కోరిన కేజ్రీ!

Update: 2016-12-22 04:38 GMT
ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు చేయడంలో ఎప్పుడూ ముందుండే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మోడీపై సాఫ్ట్ గా తనదైన శైలిలో స్పందించారు. మోడీని పొగుడుతున్నారో, తిడుతున్నారో తెలిసీ తెలియనట్టుగా స్పందించిన కేజ్రీ ఒకసమయంలో ఆయనను అభినందించారు కూడా. దీనికి కారణం... ప్రధాని మోడీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేయడమే. అయితే... ఇదే విషయంపై స్పందించిన సందర్భంగా కేజ్రీ ఇలా స్పందించారు.

ప్రధాని నరేంద్రమోడీపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే ప్రథమం అని చెప్పుకొచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌... అవినీతి ఆరోపణల నుంచి క్లీన్‌ చిట్‌ వచ్చే వరకు ఆయన రాజీనామా చేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీకి ముడుపులు ముట్టాయని రాహుల్‌ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటివరకూ మోడీపై అవినీతి ఆరోపణలు రాలేదని పాజిటివ్ గానే మాట్లాడినట్టు అనిపించినా.. రాజీనామా చేయాలని చెప్పాలనుకున్న డిమాండ్ సున్నితంగా చెప్పినట్లయ్యింది.

నరేంద్ర మోడీకి 6 నెలల్లో 9 సార్లు డబ్బులు చెల్లించినట్టు సహారా కంపెనీ వెల్లడించిందని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేజ్రీవాల్‌ పై విదంగా స్పందించారు. ప్రధాని అవినీతిపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని డిమాండ్‌ చేసిన కేజ్రీ... అవినీతిపై ఐటీ అధికారులు మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు! ఈ విషయంలో కాంగ్రెస్ - బీజేపీ నేతల మధ్య మాటల యుద్దాలు మొదలైపోయాయి. అయితే... ఈ విషయంలో బీజేపీ నేతలు రాహుల్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల... రాహుల్ విమర్శలకు బలం పేరుగుతుంది అనే వెర్షన్ వినిపిస్తుంది. అలా కాకుండా ఈ విమర్శలపైనా, ఆరోపణలపైనా బీజేపీ హుందాగా స్పందిస్తే మంచిదనే భావన పలువురిలో వ్యక్తమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News