బిపిన్ రావత్‌ నీ స్థాయి ఏమిటో తెలుసుకో ...!

Update: 2020-01-17 11:27 GMT
సీఏఏ - ఎన్ ఆర్ సీ - ఎన్‌ పీఆర్ వ్యవహారాలపై రేగుతున్న ఆందోళనలపై భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే - ఆ వెంటనే ఆ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఒక రకంగా ఆయన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. బిపిన్ రావత్ రాజకీయ నాయకుడు కాదని తన పరిధి ఏమిటో తెలుసుకుని వ్యవహరిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు ఓవైసీ.

మరోసారి తాజాగా ఆయనపై రెచ్చిపోయారు. తీవ్రవాద మూలాలున్న యువతను ప్రత్యేక క్యాంపులకు తరలించాలని సూచనలు చేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు సూటి ప్రశ్న వేశారు ఓవైసీ. గతంలో అఖ్‌ లఖ్ మరియు పెహ్లూ ఖాన్‌ లను చంపిన వారిని ఎక్కడ పెడతారు అని ప్రశ్నించారు ఓవైసీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గురువారం రోజున ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడారు. ఆ సందర్భంగా కశ్మీర్‌లో 10 ఏళ్లు 12 ఏళ్ల చిన్నారులను తీవ్రవాదులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

తీవ్రవాద మూలాలు కలిగి ఉన్న యువతను గుర్తించి వేరే క్యాంపుల్లో పెట్టాలని బిపిన్ రావత్ చెప్పిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూటి ప్రశ్న వేశారు. రాడికల్ భావజాలాలు ఉన్న వారు, వారి వెనక ఉన్న రాజకీయనేతలను ప్రత్యేక క్యాంపులకు తరలించాలని సూచించిన బిపిన్ రావత్, - పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న అస్సాంలోని బెంగాల్ ముస్లింల పరిస్థితేంటని ఓవైసీ ప్రశ్నించారు. విధానాలను ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి తప్ప ఒక జనరల్ కాదని పరోక్షంగా చురకలంటించారు ఓవైసీ. ప్రభుత్వంలోని పాలసీలు, రాజకీయాలపై ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సరికాదన్నారు
 
రాడికలైజేషన్ గురించి ప్రస్తావించాల్సి వస్తే ముందుగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, పాకిస్తాన్‌కు వెళ్లండి అన్న మీరట్ ఎస్పీలను ప్రత్యేక క్యాంపుల్లో పెట్టాలని బిపిన్ రావత్‌కు సలహా ఇచ్చారు ఓవైసీ. ఎన్‌పీఆర్-ఎన్‌సీఆర్‌లను వ్యతిరేకిస్తున్న వారిపై యోగీ ఆదిత్యనాథ్, మరియు మీరట్ ఎస్పీలు రాడికల్ భావజాలంతో మాట్లాడారని గుర్తుచేశారు ఓవైసీ.
Tags:    

Similar News