పాతబస్తీలో బడా పెళ్లి దోస్తీ

Update: 2018-12-18 09:44 GMT
హైదరాబాద్ పాతబస్తీలో సంప్రదాయ ముస్లిం నవాబ్ కుటుంబాల మధ్య బంధం బలపడుతోంది. రెండు పెద్ద ఫ్యామిలీలు వియ్యం అందుకోబోతున్నాయి. ఈనెల 28న వారి ఇంట పెళ్లి వేడుక జరుగబోతోంది.. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూతురు.. బడా పారిశ్రామిక వేత్త నవాబ్ షా ఆలంఖాన్ మనవడు బర్కత్ ఆలంఖాన్ ల పెళ్లికి ఇరు కుటుంబాలు నిశ్చయించాయి.  వీరి వివాహం ఈనెల 28న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

మజ్లిస్ అధినేత , హైదరాబాద్ ఎంపీ ఓవైసీది రాజకీయ కుటుంబం. వీరి నాన్న సలాఉద్దీన్ రాజకీయంగా మొదటి నుంచి ఉండి ప్రజల మెప్పు పొందిన వ్యక్తి. ఇక ఆలంఖాన్ ది వ్యాపార కుటుంబం. ఈయనకు దక్కన్ సిగరేట్ ఫ్యాక్టరీతోపాటు అన్వరులూమ్ కళాశాలలు, పలు విద్యాసంస్థులున్నాయి. ఈ రెండు పెద్ద కుటుంబాలు వివాహంతో ఒక్కటి కావడంతో హైదరాబాద్ పాతబస్తీలో సందడి వాతావరణం నెలకొంది.

తాజాగా ఓవైసీ, ఆలంఖాన్, పెళ్లికొడుకు బర్కత్ లు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఈ వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఓవైసీ దగ్గరి వ్యక్తి కావడంతో కేసీఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News