చంద్రబాబు ఆఫర్ ను తిరస్కరించా: అసద్

Update: 2018-11-27 08:55 GMT
ఎంఐఎం అధినేతలైన ఓవైసీ సోదరులు ఇటీవల తమ సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచారు. అక్బరుద్దీన్ అధికారంలోకి వచ్చే వాళ్లను నిర్ణయించేది మేమే అంటే.. తాజాగా అసదుద్దీన్ తనను మహాకూటమి తనను కొనాలని చూసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా హైదరాబాద్ లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన అసదుద్దీన్ సంచలన విషయాలు వెల్లడించాడు.  ‘ఏపీ సీఎం చంద్రబాబు తను పిలిచి తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తున్నారని అడిగాడని.. కేసీఆర్ కా..? లేక మహాకూటమికా అని ప్రశ్నించాడని తెలిపారు. ఇందుకోసం తనకు భారీ ఆఫర్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. అయితే చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర తెలిసి తాను వారి ఆఫర్ ను తిరస్కరించానని ఓవైసీ బాంబు పేల్చాడు..

తాను చంద్రబాబుకు.. ఢిల్లీలోని రాహుల్ గాంధీకి భయపడేవాన్ని కాదని.. అందుకే వారి ఒత్తిడికి తలొగ్గలేదని వివరణ ఇచ్చారు. ఇక తన తమ్ముడు అకర్బుద్దీన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభుత్వాన్ని నిర్ణయిస్తుందని.. ఎవరిని సీఎం చేయాలో డిసైడ్ చేస్తుందన్న అక్బర్ వ్యాఖ్యలను అసదుద్దీన్ ఖండించారు.

ఇలా తమ్ముడు అక్బరుద్దీన్ వ్యాఖ్యలను అన్న అసద్ ఖండించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  అక్బరుద్దీన్ దూకుడును అడ్డుకట్ట వేయడానికే అసద్ ఇలా చేశాడని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కేసీఆర్ తో దోస్తీ చెడవద్దనే అసద్ ఇలా తమ్ముడిని కంట్రోల్ చేస్తున్నట్టు అర్థమవుతోంది.
    

Tags:    

Similar News