పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించిన అసదుద్దీన్

Update: 2019-12-20 09:13 GMT
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్న వేళ.. బీజేపీ ప్రభుత్వం అణగొదొక్కడంపై ఆయన మండిపడ్డారు. దేశంలో నిరసన రాజ్యాంగబద్దమైన హక్కు అని ఆయన స్పష్టం చేశారు. అయితే హింసను తాము ఖండిస్తున్నామని తెలిపారు.

ఇక హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎవరైనా రాజ్యాంగాన్ని గౌరవించరని అసదుద్దీన్ స్పష్టం చేశారు. అలా చేసిన వారిపై పోలీసులు చర్య తీసుకుంటారని అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టంపై తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని అసదుద్దీన్ అన్నారు. హింసను వ్యాప్తి చేసే వారి నుంచి దూరంగా ఉండాలని దేశ పౌరులకు అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ముస్లింలనే కాదు సామ్యాన ప్రతీ పౌరుడిని ప్రభావితం చేస్తోందని అసదుద్దీన్ ఆరోపించారు. వెంటనే కేంద్రం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    

Tags:    

Similar News