తాడిపత్రిలో మద్యంమత్తులో టీడీపీ నేతల దాడులు

Update: 2021-03-27 08:51 GMT
అనంతపురం జిల్లా తాడిపత్రిలో అర్ధరాత్రి   రెండు వర్గాల మధ్య దాడులు కలకలం రేపాయి. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో రెండు గ్యాంగులు వీరంగం సృష్టించాయి. దీంతో నగరం అట్టుడికింది. యువకుల తలలు పగిలాయి.

పాత కక్షలతో మద్యం మత్తులో రౌడీషీటర్ పరమేశ్ - నాగేశ్వర్ రెడ్డి వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కత్తులు - ఇనుపరాడ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో సబ్ స్టేషన్ లోని విలువైన ఫర్నిచర్ - కుర్చీలు - విద్యుత్ పరికరాలు - కిటీకి అద్దాలు - ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

ట్రాన్స్ కో సబ్ స్టేషన్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన విందు  ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇంత ఘర్షణ జరుగుతున్నా పోలీసులు స్పందించలేదని బాదిత యువకులు వాపోయారు.

అయితే ఈ గ్రూపులో టీడీపీకి చెందినవి అని.. వారి మధ్య వర్గపోరుతోనే ఈ దాడులు జరిగినట్లు ప్రచారం సాగుతోంది.దీనిపై అధికారికంగా పోలీసులు, టీడీపీ నేతలు స్పందించాల్సి ఉంది.

Full View

Tags:    

Similar News