అయోధ్యలో రామమందిరం ఉందా? లేదా? అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఉందనే వారికి.. లేదంటూ వాదించే వారి మధ్య మాటలు ఒక పట్టాన తేలవు. ఇప్పటి వరకూ ఉన్న చాలామంది చేసే వాదన ప్రకారం.. అయోధ్యలో రామ మందిరం ఉందని.. దాన్ని బాబర్ కాలంలో కూల్చేశారన్నది చరిత్రగా చెబుతుంటారు. తాజాగా అది తప్పంటూ తన పుస్తకంలో పేర్కొన్నారు ఒక మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్ కునాల్. గుజరాత్ క్యాడర్ కు చెందిన ఆయన అయోధ్య రామమందిరం మీద ఒక పుస్తకాన్ని రాశారు.
ఇప్పుడాయన లేవనెత్తిన కొత్త పాయింట్ ఆసక్తికరంగా మారింది. ఆయన వాదన ప్రకారం రెండు విషయాలు ఇప్పుడు స్పష్టం చేసినట్లు చెప్పాలి. అందులో ఒకటి.. అయోధ్యలో రామమందిరం అనేది ఉందన్నది కన్ఫర్మ్ చేయటం. అలా ఉన్న రామమందిరాన్ని కూల్చింది బాబర్ కాదు.. ఔరంగజేబు అన్నది ఆయన వాదన. తాను చేస్తున్న కొత్త వాదనకు తగ్గట్లు ఆయన కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు.
బ్రిటిష్ కాలం నాటి కొన్ని పత్రాలు.. సంస్కృత పురాణాల్లో వ్యాఖ్యానాలు.. పురావస్తు శాస్త్రవేత్తల సమీక్షల్లోని విషయాల్ని ప్రస్తావిస్తూ తన కొత్త వాదనను వినిపిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వివాదాస్పద కట్టడం కూల్చి వేతకు ముందు నుంచి ఆ కట్టడం ఎవరిది? ఏమిటి? అన్న అంశంపై సాగుతున్న కేసులో ఆయన పాలుపంచుకుంటున్నారు. ఈ మాజీ ఐపీఏస్ అధికారి రాని పుస్తకానికి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జీబీ పట్నాయక్ ముందు మాట రాయటం గమనార్హం.