తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం ద్వారా తరచూ వార్తల్లో నిలిచే యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ప్రతిపక్షాల ఆరోపణలకు మద్దతుగా రాందేవ్ బాబా సైతం నిలిచారు. పెద్ద నోట్ల రద్దు స్కాం వేలల్లో కాదు.. లక్ష కోట్లల్లో జరిగిందని రాందేవ్ బాబా ఆరోపించారు. ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో రాందేవ్ బాబా ఈ మాటలు చెప్పడం ఇపుడు కలకలం సృష్టిస్తోంది.
పెద్దనోట్ల రద్దు పరిణామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బ్యాంకర్లు తప్పుదోవ పట్టించారని రాందేవ్ బాబా ఆరోపించారు. నోట్ల రద్దు పరిణామాన్ని అంచనా వేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని...సరైన వ్యూహం లేకుండా నోట్ల రద్దు చేశారని ఆరోపించారు. దేశం కోసం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ తదుపరి పరిణామాలను అంచనా వేయడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని మండిపడ్డారు. డిజిటల్ లావాదేవీలు చేయడంలో వేగం పెంచడం - సరిపడా చిన్న నోట్లను అందుబాటులో ఉంచడం - కరెన్సీ నల్లధన కుబేరులకు అండకుండా చూడటం వంటి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాందేవ్ బాబా సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/