జేఎన్‌ యూలో రాందేవ్‌ బాబా ర‌చ్చ‌

Update: 2016-03-10 05:19 GMT
వివాదాలు - నినాదాలతో మార్మోగుతున్న జేఎన్‌ యూ మరో కార్యక్రమానికి వేదిక కానుంది. జేఎన్‌ యూ క్యాంపస్‌ లో భారీ యోగా శిబిరం నిర్వహించాలని ప్ర‌ముఖ యోగా గురు బాబా రాందేవ్‌ యోచిస్తున్నారు. విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు జేఎన్‌ యూలో యోగా శిబిరం నిర్వహించాలని బాబా రాందేవ్‌ తమతో చెప్పారని ఆయన ప్రతినిధి ఎస్‌ కే తిజరావాలా వెల్లడించారు.

త్వ‌ర‌లో నిర్ధిష్ట ప్రణాళికతో జేఎన్‌ యూ సందర్శించి అక్కడి విద్యార్థులకు యోగా నేర్పిస్తానని రాందేవ్‌ బాబా చెప్పారని తెలిపారు. అయితే దీనికి సంబందించి తేదీలు ఇంకా ఖరారు కాలేదన్నారు. గత ఏడాది డిసెంబర్‌ లో వేదాంత - ఆయుర్వేద అంశాలపై యూనివర్సిటీలో జరిగే ఓ విద్యా సదస్సులో బాబా రాందేవ్‌ ప్రసంగిస్తారనే ప్రచారం సాగింది. దీనిపై అద్యాపకుల్లో ఒక వర్గం నుంచి జేఎన్‌ యూ విద్యార్ధి సంఘం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఈ సదస్సుకు రాందేవ్‌ బాబా హాజరు కాలేదు. ఇదిలా ఉండ‌గా వ్య‌క్తిగ‌త హోదాలో ఆయ‌న జేఎన్‌ యూకు వ‌స్తే త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌ని జేఎన్‌ యూ విద్యార్థి సంఘాలు ప్ర‌క‌టించాయి. అయితే తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే వ్యతిరేకిస్తామని వారు స్పష్టం చేశారు. చూస్తుంటే త్వరలో జేఎన్‌ యూలో రాందేవ్ బాబా రచ్చ కొనసాగేలా ఉందంటున్నారు.
Tags:    

Similar News