తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను హర్ట్ చేశారట. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో పార్టీ నేతలు కలత చెందుతున్నారట. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహించుకునే మహానాడు మరోసారి రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటమే ఈ ఆవేదనకు కారణమని అంటున్నారు. వరుసగా రెండో ఏడాది తమ పార్టీ పండుగ నిర్వహించుకోకపోవడం పట్ల సహజంగానే తెలుగు తమ్ముళ్లు ఇబ్బంది పడుతున్నారు.
ప్రతి ఏడాది పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజులపాటు టీడీపీ శ్రేణులు జెండా పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపు పదివేల మంది ప్రతినిధులతో మూడు రోజులపాటు తెలుగు దేశం శ్రేణులు మహానాడును నిర్వహించుకోవడంతోపాటు పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా దీనిలో నిర్వహించుకుంటారు. మహానాడు వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. ప్రతి రెండేళ్ల ఒకసారి ఈ ఎన్నిక జరుగుతోంది. ప్రపంచంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న నేపధ్యంలో మహానాడు వేడుకపై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా మూడవ విడత లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో మహానాడు నిర్వహణ సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి.
మూడో విడత లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 17 వరకు కొనసాగనున్నాయి. లాక్‌డౌన్ మరికొంత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తోన్న నేపధ్యంలో మహానాడు నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ నాలుగో విడత లాక్‌డౌన్ ప్రకటించకపోయినా కేవలం 9 రోజుల వ్యవధిలో మహానాడు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడం సాధ్యంకాని పని అని పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పదివేల మంది ప్రతినిధులతో నిర్వహించాల్సిన మహానాడు కార్యక్రమం జరిగే పరిస్థితి ఏమాత్రం లేదు. ఇప్పటికే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీయ నియంత్రణ పాటిస్తూ హైదరాబాద్‌లో తన నివాసంలో ఉంటున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అనూహ్యంగా మహానాడు వేడుక రద్దు అయ్యింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మహానాడు దాదాపుగా ఈ ఏడాది కూడా రద్దయినట్టే అని తెలుస్తోంది.