కర్నూలు జిల్లాలో ఘోరం: అమానవీయంగా రెండు ఘటనలు

Update: 2020-07-19 06:30 GMT
మహమ్మారి వైరస్ భయంతో సాధారణ అనారోగ్యానికి కూడా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆ వైరస్ అనేక అమానవీయ ఘటనలకం కొరణభూతంగా మారుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో రెండు సంఘటనలు వైరస్ తో ఎలాంటి దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయో చెబుతోంది. ఏపీలో అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో కర్నూలు తొలి స్థానంలో ఉంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ భయంతో ఓ తండ్రి తన శిశువు మృతదేహానికి ఖననం చేయకుండా కాల్వలో పడఘయగా.. మరో ఘటనలో వైరస్ తో భర్త మృతి చెందితే భార్యకు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

కర్నూలు జిల్లా కోటపాడుకు చెందిన మదార్‌బీ శుక్రవారం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టిన వెంటనే శిశువు చనిపోయింది. దీంతో ఆ భార్యాభర్తలు కన్నీరు పెట్టారు. పుట్టగానే పాప చనిపోవడంతో ఆ భార్యాభర్తలు కలత చెందారు. ఆ శిశువును గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు మృతదేహం గ్రామానికి తీసుకురావొద్దని చెప్పారు. ఆ గ్రామస్తులు వైరస్ భయంతో ఆ విధంగా చెప్పారు. ముందే పాప చనిపోయిన బాధలో ఉన్న వారికి గ్రామస్తుల నిర్ణయంతో మదార్‌ బీ.. భర్త షాంషావలీ ఆవేదన చెందారు. దిక్కుతోచని భర్త షాంషావలీ శనివారం ఆ శిశువు శవాన్ని కేసీ కెనాల్‌ లో పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు మృతదేహాన్ని చూసి అధికారులకు సమాచారం అందించారు. బిడ్డ చేతికి ఉన్న ట్యాగ్‌ ఆధారంగా షాంషావలీకి సమాచారమిచ్చారు. ఆయన వచ్చి మళ్లీ మృతదేహాన్ని తీసుకెళ్లిన దౌర్భాగ్యపు పరిస్థితి.

మరో ఘటన

ఆళ్లగడ్డలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మూడు రోజుల క్రితం ఓ 50 ఏళ్లలోపు వ్యక్తికి వైరస్ సోకింది. దీంతో వైద్యాధికారులు ఇంటి సమీపంలోనే ప్రత్యేక గదిలో హోం ఐసొలేషన్‌ లో ఉంచారు. నిరంతరం మందులు అందించేలా ఏర్పాట్లు చేశారు. కానీ శనివారం అతడి ఆరోగ్యం క్షీణించింది. కుటుంబసభ్యులు వెంటనే ప్రైవేటు అంబులెన్సును పిలిపించి అందులోకి ఎక్కిస్తుండగానే అతడు మృతి చెందాడు. భర్త చనిపోవడంతో భార్య రోదిస్తూ కూర్చుంది. ఆమెను చూసి స్థానికులు బాధ పడుతున్నా ఓదార్చడానికి ఎవరూ రాలేదు. ఆమె పీపీఈ కిట్‌ ధరించి ఉండడంతో వైరస్ భయంతో ఎవరూ దగ్గరకు కూడా రాలేదు. చివరకు మున్సిపల్ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు.
  


Tags:    

Similar News