టెలికాం రంగంలో సంచలనంగా మారటమే కాదు.. అనూహ్య రీతిలో స్వల్ప వ్యవధిలో దూసుకెళ్లిన రిలయన్స్ జియోకు తాజాగా గట్టి షాక్ తగిలింది. అది కూడా జనం చేతిలోనే. ఏ ప్రజలైతే జియో కనెక్షన్ కోసం వెర్రెత్తిపోవటమే కాదు.. సిమ్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచొని మరీ సొంతం చేసుకున్నారో.. అదే జియోకు దిమ్మ తిరిగే షాక్ తగిలిన వైనం తాజాగా బయటకు వచ్చింది.
గత ఏడాది డిసెంబరులో పెద్ద ఎత్తున మొబైల్ యూజర్లు జియోను వదిలి వెళ్లిపోయారు. ఎందుకిలా? అంటే.. అనూహ్యంగా పెంచిన ధరలే కారణమని చెబుతున్నారు.
అప్పటివరకు ఉన్న ధరలకు 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవటంతో.. తక్కువ ధరలున్న నెట్ వర్కుకు చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ భారీగా లాభపడింది. వాస్తవానికి కేంద్రంలోని మోడీ సర్కారు బీఎస్ఎన్ఎల్ ను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ఉండటం తెలిసిందే.
ఇలాంటివేళ.. ఈ సంస్థకు చెందిన నెట్ వర్క్ కి పెద్ద ఎత్తున మొబైల్ యూజర్లు చేరారు. తాజాగా విడుదలైన ట్రాయ్ లెక్కల్ని చూస్తే.. నవంబరుతో పోలిస్తే డిసెంబరు 2021 లో దేశ వ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య 1.28 కోట్లు తగ్గిందని పేర్కొంది. రిలయన్స్ జియో నుంచి దాదాపు 1.29 కోట్ల మంది మొబైల్ యూజర్లు తమ కనెక్షన్లు వదులుకున్నారు. దీంతో.. ఆ సంస్థ మొబైల్ వినియోగదారులు 41.57కు పరిమితమైంది.
ఇదిలా ఉంటే.. జియోను వదులుకున్న వినియోగదారుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు మారినట్లుగా తెలుస్తోంది. తర్వాతి ప్రాధాన్యత ఎయిర్ టెల్ కు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నెలవారీ వినియోగదారుల డేటా ప్రకారం.. ఎయిర్ టెల్ 4.75 లక్షల మంది కొత్త వినియోగదారులను పొందటం ద్వారా తన వినియోగదారుల మొత్తం సంఖ్యను 35.57 కోట్లకు చేరుకుంది. ధరల పెంపు జియోకు షాకిస్తే.. అది కాస్తా ఎయిర్ టెల్ కు వరంగా మారటం విశేషం.