కూతురికి బాల‌కృష్ణ సాద‌ర స్వాగ‌తం.. స‌రికొత్త పాత్ర‌లో బ్రాహ్మ‌ణి!

Update: 2021-02-16 10:30 GMT
ప్ర‌ముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా లోకేష్ స‌తీమ‌ణి బ్రాహ్మణి బ‌స‌వ తారకం క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో స‌రికొత్త బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌బోతున్నారు.  బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్ర‌స్ట్ బోర్డు స‌భ్యురాలిగా ఆమె నియ‌మితుల‌య్యారు. ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్న బాలకృష్ణ కూతురికి వెల్కం చెప్పారు.

ఇవాళ ఇంట‌ర్నేష‌న‌ల్ చైల్డ్ హుడ్ క్యాన్స‌ర్ డే. ఈ సంద‌ర్భంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన బ్రాహ్మ‌ణిని బాల‌కృష్ణ అభినందించారు. అనంత‌రం బాల‌య్య మాట్లాడుతూ.. చిన్న త‌నంలో క్యాన్సర్ బారిన ప‌డ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మని అన్నారు. ఆ చిన్నారుల‌ను పీడియాట్రిక్స్ క్యాన్స‌ర్ తో పోరాడుతున్న యోధులుగా అభివ‌ర్ణించారు బాల‌య్య‌.

చిన్నారులు క్యాన్సర్ బారిన ప‌డితే ఆ కుటుంబం మొత్తం ఏవిధంగా ప్రభావితం అవుతుందో.. ఎన్ని బాధ‌లు అనుభ‌విస్తుందో చెప్పారు బాల‌కృష్ణ‌. ఈ క్యాన్స‌ర్ మ‌హమ్మారితో పోరాటం చేస్తున్న చిన్నారి యోధులంద‌రూ త‌ప్ప‌కుండా క్యాన్స‌ర్ ను జ‌యిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు‌.కాగా.. నూత‌న‌ ట్ర‌స్టీగా వ‌చ్చిన నారా బ్రాహ్మణిని.. ఎన్‌బిటిఆర్‌సిఎఫ్‌లోని వైద్యులు, సిబ్బంది సాద‌రంగా ఆహ్వానించారు. అనంత‌రం బాల‌ల క్యాన్స‌ర్ క్యాంపస్‌ను బ్రాహ్మ‌ణి సందర్శించారు.
Tags:    

Similar News