శవాలపై రాజకీయాలు వద్దు: ఎస్పీ బాలు

Update: 2015-07-15 10:13 GMT
    పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి భక్తుల మరణించిన ఘటనను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న నాయకుల తీరును ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఏకిపారేశారు. మంగళవారం జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపం తెలిపిన ఆయన ఈ సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండాలని.. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని...అంతేకానీ రాజకీయాలకు ఇది సమయం కాదని హితవు పలికారు.

    ఈ ఘటన పై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. జరిగిన సంఘటన తనను చాలా బాధించిందన్న ఆయన ఇలాంటి విషాద సమయాన్ని రాజకీయాలకు వాడుకోవద్దు అంటూ రాజకీయ నాయకులను కోరారు. ''మీరు ఏ పార్టీ నేతలనైనా కానివ్వండి... దీన్ని రాజకీయాలకు వాడుకోవద్దు... తీవ్ర విచారంలో మునిగిపోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉందాం"" అన్నారు.  వేలాది మంది ఒక్కసారిగా భక్తులు పోటెత్తినపుడు అధికారులుక కూడా చేయాల్సింది ఏమీ ఉండదు. అంతేకాదు.. భక్తులు కూడా సంయమనంతో ఉండాలని.. క్రమశిక్షణతో వెళ్తే ఇలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ఒకవేళ భక్తులనునియంత్రించడానికి పోలీసులు ఏమాత్రం దూకుడుగా వ్యవహరించినా మనం వారిని విమర్శిస్తామని వాస్తవ పరిస్థితులను మాట్లాడారు.

    కాగా తొక్కిసలాట అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్ నేతలు, పలు ఇతర పార్టీల నాయకులు విరుచుకుపడ్డారు. వారిలో కొందరు సీఎం రాజీనామా చేయాలనీ కోరారు. బాలసుబ్రహ్మణ్యం హితవు మాటలు వారినుద్దేశించినవేనని సోషల్ మీడియాలో ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News