దూకుడుగా వ్యవహరించటం.. రాజకీయ ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోయటం ఎలా అన్న విషయాలు తెలంగాణ అధికారపక్ష నేతలకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. ప్రత్యర్థి ఎవరైనా సరే.. బుల్ డోజ్ చేసేయటంలో వారికి వారే సాటి. ఒక్కోపార్టీని టార్గెట్ చేసేటప్పడు కొన్ని అంశాల ప్రస్తావన తీసుకొచ్చి లాజిక్కుగా చెప్పటం వారికి మాత్రమే చెల్లుతుంది. మహారాష్ట్ర సర్కారుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకున్న మహాఒప్పందంపై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డిని తాజాగా టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ టార్గెట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారపక్షం తేలిగ్గా టార్గెట్ చేయగలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమనే చెప్పాలి. బాబు పేరును ప్రస్తావిస్తే చాలు.. తెలుగు తమ్ముళ్లు బుక్ అయినట్లే. విషయం ఏదైనా.. తమను ఇరుకున పెట్టేలా వ్యవహరించే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల్ని టార్గెట్ చేసుందకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన తీసుకురావటం.. ఏదో ఒకలా లింకు పెట్టి తిట్టేస్తుంటారు. తాజాగా అలాంటి వ్యూహాన్నే ప్రదర్శించారు ఎంపీ బాల్క సుమన్.
మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ పోరాటాన్ని షురూ చేసిన రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కేసీఆర్ సర్కారు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తుంటే..దాన్ని దెబ్బ తీసేలా రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవటానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. అందుకు రేవంత్ రెడ్డి మద్దతుగా నిలిచినట్లుగా ఆరోపించిన ఆయన.. రేవంత్ తన బెదిరింపు రాజకీయాల్ని మానుకోవాలంటూ హితవు పలికారు. పలు అంశాల్లో అబద్ధాలు చెప్పటం ద్వారా రేవంత్ ప్రజల్లో నవ్వుల పాలయ్యారని.. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినట్లుగా ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు విపక్షాలు శనిలా మారాయని దుయ్యబట్టిన బాల్క సుమన్ అందరిని హోల్ సేల్ గా తిట్టేశారు.
ఒకవేళ బాల్క సమన్ మాటలే నిజమని అనుకుంటే.. రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఏందన్నది ఒక ప్రశ్న. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో గళం విప్పి.. అధికారపక్షాన్నిబలంగా నిలదీసే సత్తా ఉన్న నేత ఎవరైనా ఉన్నారా అంటే.. అది రేవంత్ రెడ్డి మాత్రమే. అలాంటప్పుడు రేవంత్ మీద బాబు ఆధారపడాలా? లేక.. బాబు మీద రేవంత్ ఆధారపడాలా? అంటూ లోగుట్టుగా ప్రశ్నిస్తున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు.