మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు కొండంత విషాదం ఎదురైంది. ఆయన ఒక్కగానొక్క కుమారుడు 21 ఏళ్ల వైష్ణవ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊహించని విధంగా జరిగిన ఈ వైనంతో ఒక్కసారి షాక్ తిన్నారు.
హుటాహుటిన వైష్ణవ్ ను ఆసుపత్రికి చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి 10.45 గంటల వేళలో రాత్రివేళ భోజనం చేస్తుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే.. ముషిరాబాద్ లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు.
ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవ్.. చిన్న వయసులోనే గుండెపోటుకు గురి కావటం.. నిమిషాల వ్యవధిలోనూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటం దత్తన్న కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచెత్తింది. వైష్ణవ్ ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వైద్యులు.. చివరకు అర్థరాత్రి 12.30 గంటల వేళలో మరణించినట్లు ప్రకటించారు.
చిన్న వయసులోనే మరణించటం.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఇలాంటి పరిస్థితి రావటం దత్తన్న ఫ్యామిలీ షాక్ లో ఉంది. ఇటీవల కాలంలో చిన్న వయస్కులు గుండెపోటుకు గురి కావటం ఎక్కువ అవుతోంది. కొడుకు హఠాన్మరణంతో తీరని నష్టం వాటిల్లిన దత్తన్న ఫ్యామిలీని పలువురు ప్రముఖులు.. సన్నిహిత మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.